Dham ka Biryani Preparation in Telugu, Testy Biryani Preparation, Biryani Items

బెస్ట్ రైస్’తో టేస్టీ నవాబీ బిర్యానీ.. రైస్ కేక్..  ఫిర్ని.. తదితర వెరైటీ వంటకాలు తయూరు చేసి చూపించారు ప్రవుుఖ చెఫ్ పునీత్ మెహతా.
 శుక్రవారం హరిత హోటల్‌లో ‘బెస్ట్’రైస్‌తో ఫుడ్ వెరైటీలను వురింత రుచికరంగా ఎలా వండుకోవచ్చనే దానిపై పునీత్ డెమో ఇచ్చారు. రంజాన్ పర్వదినాల్లో బిర్యానీ రుచులకు ప్రీమియుం బాస్మతి రైస్ కంపెనీల్లో ఒకటైన బెస్ట్‌రైస్ సరైనదని తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ ఫుడ్ లిమిటెడ్ సీఈవో ఆయుష్మాన్ గుప్తా మాట్లాడుతూ రుచి, పోషకాల మిశ్రమంగా బెస్ట్ రైస్‌ను వినియోగదారులకు అందిస్తున్నామని చెప్పారు. రూ.2000 కోట్లకు పైగా టర్నోవర్‌తో దేశీయ మార్కెట్లో బెస్ట్ రైస్ ప్రముఖ స్థానంలో ఉందన్నారు.
 కావలసిన పదార్థాలు :
చికెన్‌ - ఒక కిలో
బాస్మతి బియ్యం - ఒక కిలో
గరం మసాల - రెండు టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను
పెరుగు - ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
పచ్చి మిరపకాయలు - ఐదు
ఎండు మిరపకాయలు - ఆరు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
తయారుచేయు  విధానం :
ముందుగా మాసాన్ని శుభ్రంగా కడిగి కొద్ది గా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి నీళ్ళు వంచుకోవాలి. 
ఐదు నిమిషాల తర్వాత  నీళ్లు పోసి స్టవ్  మీద బియ్యం  సగం మాత్రమే ఉడికించాలి. 
ఇప్పుడు స్టవ్  మీద మరో మందపాటి గిన్నె  ఉంచి సరిపడా నూనె వేసి పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. 
ఇప్పుడు పెరు గులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా దీనిలో  వేసి దానిపై ఉడికించిన అన్నాన్ని వేయా లి. 
ఇలాగే ఇంకో పొరలా మిగలిన మాంసాన్ని మళ్ళి  అన్నాన్ని వేసి మూత పెట్టాలి. 
పాత్ర నుంచి ఆవిరి బయ టకు పోకుండా ఉండటానికి మెత్తగా కలిపిన మైదాను మూత అంచుల చుట్టూ పెట్టాలి. 
మైదా పిండి మొత్తం ఆవిరైపోయి పెచ్చులుగా వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. 
చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి అలంకరించు కోవాలి. దీనికి గోంగూరకూరను  వేసి సర్వ్‌ చేసుకోవచ్చు.