ఈ హీరోకి ఇబ్బందులు తప్పవా..? Sharukh khan getting Court notice about.....


బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్‌పై బాంద్రా కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ముంబైలో షారూఖ్ నివాసమైన ‘మన్నత్’ పక్కన ఆయన అక్రమంగా ఓ ర్యాంప్‌ను నిర్మించడంపై వివాదం నలుగుతోంది. దీనిపై సామాజిక కార్యకర్త నికోలాస్ అల్మీదా బాంద్రా కోర్టులో షారుఖ్‌కు వ్యతిరేకంగా కేసు వేశారు. 

ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన ఈ కట్టడాన్ని తొలగించాలని అధికారులను తాను అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతోనే కోర్టుని ఆశ్రయించానని అల్మీదా వెల్లడించాడు. ఈ పిటిషన్ వచ్చేనెల విచారణకు రానుందని రానుంది. ఈ కేసులో షారుఖ్‌తోపాటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మరో ముగ్గురు అధికారులను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.