Aakaakara nuts-ఆకాకర కాయలు Benefits, Aakaakara hidden Benefits, home remedies, uses



 ఆకాకర కాయలు

    కాకరకాయ జాతికి చెందినదే ఆకాకరకాయ. ఈ కాలంలో విరివిగా దొరుకుతాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో..!

జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి. పీచూ, విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి. గర్భిణులకు ఈ కాకరకాయ చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫొలేట్‌లు శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడుతుంది. గర్భిణులు రెండు పూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వల్ల దాదాపు వందగ్రాముల ఫొలేట్‌ అందుతుంది. మధుమేహంతోబాధపడే వారికి ఆ కాకరకాయ మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్‌ స్థాయుల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి. 

తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్‌ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఆకాకరకాయలోని విటమిన్‌ 'సి' శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో ఫ్లవనాయిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే విటమిన్‌ 'ఎ' కంటి చూపునకు మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.