30 రోజుల్లో మీ శరీరం నిర్విషీకరణ చేసుకోవడానికి 15 అద్భుత మార్గాలు
నిర్విషీకరణ అంటే మన శరీర వ్యవస్థ నుండి విషాన్ని తొలగించటం అని అర్థం. శరీరం నిర్విషీకరణ కావటానికి ఉపయోగించే ఆహారాలు శరీరానికి హాని కలిగించే విషీకరణాలను తొలగించి శరీరం చైతన్యవంతంగా మరియు మరింత కాంతివంతంగా చేస్తాయని పరిశోధనలు నిరూపించాయి. అందువల్ల, శరీరం నిర్విషీకరణ కావటానికి చేయవలసిన పద్ధతులను తెలుసుకోవటం చాలా ముఖ్యం.
శరీరం విషీకరణ యొక్క స్థిరమైన పెరుగుదల అనేక దీర్ఘ-కాల సమస్యలను కారణమౌతుంది. దీని స్థాయి మలబద్ధకం మరియు అలసట నుండి కాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. మీరు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించినప్పుడు మాత్రమే నిర్విషీకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది మరియు సమర్థవంతంగా పని చేస్తుంది. మద్యం మరియు డ్రగ్స్ నుండి శరీరం నిర్వీర్యం చేయటానికి వైద్య సలహాతో మాత్రమే చేయాలి.
నిర్విషీకరణ అనేది అనేక జీవనశైలి సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి ఒక ఉపయోగకరమైన ఉపకరణం. మీరు మీ శరీరం సరిపోయేందుకు ఏ పద్ధతినైనా అనుసరించవొచ్చు. మీ శరీరానికి తిరిగి చైతన్యం నింపాలనుకుంటే, మీరు కొన్ని సాధారణ మరియు సులభమైన పద్ధతుల ద్వారా నిర్విషీకరణకు ప్రయత్నించవచ్చు. క్రింద శరీర నిర్విషీకరణకు కొన్ని మార్గాలు ఇచ్చాము. చూడండి.
ఫ్రూట్ డిటాక్స్
ఇంట్లోనే సహజంగా శరీరానికి హాని కలిగించే వాటిని తొలగించే విధానాలలో పండ్లను ఆహారంగా తీసుకోవాలి. నిర్విషీకరణ పండ్లను చాలా ఎక్కువగా తినడం ద్వారా చేయవచ్చు.
ఫాస్ట్ లిక్విడ్
ఇది కూడా శరీరం నిర్విషీకరణ అయ్యేందుకు అవలంబించే మార్గాలలో ఒకటి. టీ, పండ్ల రసం, నీరు లేదా షేక్స్ వంటి ద్రవపదార్థాలు త్రాగండి. ఈ విధంగా మీ శరీరం నిర్విషీకరణ కావటానికి 2-3 రోజులు చేయవచ్చు.
పండ్లు మరియు కూరగాయలు
ఈ సహజ నిర్విషీకరణ పద్ధతి ఉత్తమమైనది. పండ్లు మరియు కూరగాయలు శరీర నిర్విషీకరణ కావటానికి ఉపయోగపడే విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలను కలిగి ఉంటాయి.
సేంద్రీయ ఉత్పత్తులు
ఇంట్లో సహజంగా శరీరానికి హాని కలిగించే వాటిని తొలగించే మార్గాలలో ఇది ఒకటి మీరు ఎల్లప్పుడూ సేంద్రీయ కూరగాయలు మరియు మాంసం తీసుకునేలా చూసుకోండి.
నీరు
మీరు రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగేలా చూసుకోండి. ఈ విధంగా త్రాగటం వలన శరీరం నుండి అన్ని విషాలు బయటకు నెట్టివేయటానికి సహాయపడుతుంది.
మద్యం తీసుకోవొద్దు
శరీర నిర్విషీకరణకు ముఖ్యమైనది ఆల్కహాల్ కు 'నో' అని చెప్పటం. ఆల్కహాల్, శరీరాన్ని మరింత కలుషితం చేస్తుంది మరియు అనేక ఆరోగ్య సమస్యలు సృష్టిస్తుంది. దీనివలన కాన్సర్ వంటి ఇతర సమస్యలు కూడా కలుగుతాయి.
ఎక్కువ మోతాదులో చక్కర వాడవొద్దు
శరీరానికి హాని కలిగించే వాటిని తొలగించటానికి మరొక సహజ మార్గం అధిక చక్కెర వినియోగం మానివేయాలి. మీరు ఒకసారి తక్కువ వినియోగానికి అలవాటు పడితే, ఇది మీ రొటీన్ లో భాగంగా అవుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.
గాలిలో హానికరమైన విషాలు
ఫర్నేసులు, గ్రిల్ మరియు కారు ఇంజన్లు నుండి విడుదల అయ్యే కార్బన్ మోనాక్సైడ్ శరీరానికి హానికరమైనది. శరీరం నిర్విషీకరణగా ఉండాలంటే, ఈ హానికరమైన ఉత్పత్తుల నుంచి దూరంగా ఉండటం అవసరం.
ధ్యానం
ఇది కేవలం శరీరానికి మాత్రమే కాదు, మీ మెదడును కూడా నిర్విషీకరణగా చేస్తుంది. అనుకూల ధోరణిలో మరియు ప్రశాంతత కలిగేలా మీ మనస్సును ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలు, కోపం మరియు శోకం మానుకోండి.
మెదడు-శరీరం సంతులనం
ఇది ఖచ్చితంగా చాలా అవసరం. సమతుల్యత ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామాలు దీనికి చాలా ముఖ్యం.
నిమ్మకాయ నీరు
శరీరంలోని విషాలను తొలగించే మార్గాలలో ఇది ఒకటి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు కాలేయాన్ని ఉత్తేజపరచటం వలన నిర్విషీకరణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.
తృణధాన్యాలు
వండిన తృణధాన్యాలు తీసుకోవటం నిర్విషీకరణ ప్రక్రియకు సహాయపడే మరొక పద్ధతి. శరీరానికి హానికరమైన జిగట ఆహారాన్ని నివారించండి.
80-20 రూల్
మీరు నిర్విషీకరణ ప్రక్రియలో ఉన్న సమయంలో, ఎల్లప్పుడూ ఈ నియమం గుర్తుంచుకోవాలి. 80 శాతం ముడి పండ్లు మరియు పచ్చి కూరగాయలు, మరియు 20 శాతం వండిన ఆహారాన్నితీసుకోండి.
కొన్ని ఆహారాలు
కొన్ని ఆహారాలు తీసుకోకండి మీరు మీ శరీర నిర్విషీకరణ ప్రక్రియలో హాని కలిగించే పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, చేపలు, చక్కెర, జిగటగా ఉన్న ఆహారం మరియు మద్యం పూర్తిగా మానేయండి.