Preparation of Chicken tamotto at home, Weekend Special receipies at home special, easy way to prepare chicken at home

పాప్ కార్న్ చికెన్ కెఫిసి స్టార్టర్స్ చాలా ఫేమస్ అయినది. ప్రస్తుత రోజుల్లో కెఫెసి ఫుడ్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. అలాంటి వారిలో మీరూ ఒకరైతే ఈ పాప్ కార్న్ చికెన్ ను మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
కొన్ని మసాలాదినుసులతో చికెన్ మ్యారినేట్ చేసి, ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేసుకోవాలి. చాలా సులబమైన, టేస్టీ పాప్ కార్న్ చికెన్ రిసిపిని ఎలా తయారుచేయాలో, ఈ హెల్తీ అండ్ న్యూట్రీషియన్ వంటకు ఏమేం కావాలో ఈ క్రింది విధంగా తెలుసుకోండి...
కావలసిన పదార్థాలు:
చికెన్ బ్రెస్ట్ (బోన్ లెస్): 250grm(చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
కాశ్మీర్ కారం : 1tsp
టొమాటో కెచప్: 1tsp
ఉప్పు : రుచికి తగినంత
గరం మసాలా : : 1tsp
కసూరీ మేథీ పొడి : చిటికెడు 
నిమ్మ రసం: 1tsp
అల్లం - వెల్లుల్లి పేస్ట్ : 1tsp
మైదా పిండి : 1cup
కోడి గుడ్లు - 2 (సొన గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి);
నూనె : 1tsp
చాట్ మసాలా : 1/2tsp

తయారు చేయు విధానం: 

1. ముందుగా ఒక పాత్రలో కాశ్మీర్ కారం, టొమాటో కెచప్, ఉప్పు, గరం మసాలా, కసూరీ మేథీ పొడి, నిమ్మరసం, అల్లం - వెల్లులి పేస్ట్‌లను బాగా కలపాలి.
2. తర్వాత ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి, సుమారు గంటసేపు ఊరబెట్టాలి. 
3. ఆ తర్వాత గిలక్కొట్టిన కోడిగుడ్డు సొనను కూడా వేసి, సొన ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. 
4. ఓ గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో చికెన్ ముక్కల్ని వేసి, ముక్కలకు మైదా బాగా పట్టేవరకూ కలపాలి. 
5. ఓవెన్ ను 20 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. బాస్కెట్‌లో చికెన్ ముక్కలను వేసి, ఎయిర్ ఫ్రయర్‌లో పెట్టి, ఐదు నిమిషాలు ఉంచాలి. ఆరేడు నిమిషాల్లో ముక్కలు వేగిపోతాయి. 
6. ఆ పైన వాటిని ప్లేట్ లోకి తీసుకుని, వాటి మీద చాట్ మసాలా, కారం జల్లి వేడివేడిగా వడ్డించాలి. అంతే పాప్ కార్న్ చికెన్ రెడీ.
 మాంసాహారం, చికెన్, గరం మసాలా, ఉప్పు, టమోటో, నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి