‘ప్రేమ ఎంత మధురం...’ అంటూ బ్రిటిష్ భామ అమీ జాక్సన్ ప్రణయ గీతాలు
ఆలపిస్తున్నారు. బుల్లితెర నటుడు ర్యాన్ థామస్‌కి అమీ మనసిచ్చారట. ‘మదరాస
పట్టనమ్’ అనే సినిమాకి అవకాశం రావడంతో ఇండియా వచ్చిన అమీ, ఆ తర్వాత వరుసగా
సినిమాలు చేస్తూ, ఇక్కడే స్థిరపడ్డారు. నాలుగేళ్ల క్రితం ‘మిస్ ఇంగ్లాండ్’
పోటీలో పాల్గొన్నప్పుడు ర్యాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిందట. ఆ
కార్యక్రమానికి ర్యాన్ ఓ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అప్పట్నుంచీ అడపా
దడపా కలుసుకుంటున్న అమీ, ర్యాన్ ఇటీవలే తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే
కాదు.. అంతకు మించింది ఏదో ఉందని గ్రహించారట. ఈ ప్రేమ ప్రయాణాన్ని జోరుగా
సాగించడం పలువురి దృష్టిలో పడింది.
అలాగే, ర్యాన్‌తో తను పార్టీ చేసుకున్న రెండు మూడు ఫొటోలను అమీ
ట్విట్టర్‌లో పెట్టడంతో ఇక, ఈ ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు మొదలయ్యాయి.
దాంతో అసలు ఎవరీ ర్యాన్ అని ఇక్కడివాళ్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఒకప్పుడు ‘సెక్సియస్ట్ మేన్’గా నామినేట్ అయ్యారని, ఆయనకు ఆల్‌రెడీ
పెళ్లయ్యిందని, ఓ కూతురు కూడా ఉందని ఇలా ర్యాన్ జీవితం గురించి తెలుసుకున్న
తర్వాతే ఔత్సాహికరాయుళ్ల ఆరాటం తగ్గింది. వివాహితుడితో ప్రేమలో పడి అమీ ఓ
కాపురంలో చిచ్చు పెట్టిందనుకోమాకండి. భార్యతో మనస్పర్థల కారణంగా విడాకులు
తీసుకున్నారట ర్యాన్. మరి... అమీతో ఇతగాడి ప్రేమ ఎంత దూరం వెళుతుందో.