మన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ బంగ్లాదేశ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఆమెకు జమ్దానీ చీరలను బహుకరించారు. ఆ చీరలేమిటో చూద్దాం..
జమ్దానీ అనేది పర్షియన్ పదం. జామ్ అంటే పువ్వు అని అర్థం. బంగ్లాదేశ్‌లోని ఢాకా కేంద్రంగా తయారవుతున్న జమ్దానీ చీరలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. బెంగాల్ సంప్రదాయ నేత కార్మికులు దీన్ని తయారు చేసేవారు. పురాతన కాలంలో దీన్ని అప్పటి చేనేత కార్మికులు తయారు చేశారు. వీటిని మొఘల్ రాజులు, బ్రిటీష్ పాలకుల సతీమణులు ధరించారు. జమ్దానీ సంప్రదాయ నేత కళతో కూడిన నేత ఈ చీరలను యునెస్కో సైతం పురాతన సాంస్కృతిక సంపదగా గుర్తించింది. ఈ చీరలపై మొక్కలు, పూల డిజైన్లతో కూడిన ఈ చీరలను మగువలు ఇష్టపడుతున్నారు. ఇప్పటికీ ఈ చీరలు కాటన్‌తోపాటు నాణ్యత, స్టయిల్, డిజైన్ల విషయంలో వీటిదే అగ్రస్థానం అంటుంటారు. జారిఫ్ ఫ్యాషన్ డిజైన్ లాంటి కొత్త వారు సైతం జమ్దానీ చీరలను పార్టీ శారీగా ఎంబ్రాయిడరీ కాంబినేషన్, హ్యాండ్ కర్‌చుపి వర్క్స్‌తో తయారు చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం సైతం మధ్యదళారులను నివారించి చేనేత కార్మికులకు ప్రోత్సహించేందుకు వీలుగా జమ్దానీ పల్లిని ఢాకా సమీపంలో ఏర్పాటు చేసింది.