జాగ్రత్తగా గమనిస్తే ప్రతి మహిళా ఒక అందగత్తే! ధరించే దుస్తుల్లో మార్పులు చేసుకుంటే చాలు.. ఆ అందం ద్విగుణీకృతమవుతుంది. తాజా ట్రెండ్‌లను గమనించి దుస్తులు ధరిస్తే ఎక్కడికి వెళ్లినా అందరి కళ్లు మనమీదే ఉంటాయి. ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో కలకలం రేకెత్తిస్తున్న 'రెట్రో'పై ఒక లుక్కేద్దాం..
మన పూర్వకాలం బ్లాక్ అండ్ సినిమాల్లో హీరోయిన్లు ఎలాంటి చీరలు కట్టుకొనేవారో, ఎలాంటి జాకెట్లు వేసుకొనేవారో గమనించండి.. ఆ బట్టలనే మనం ఇప్పుడు రెట్రో అని పిలుస్తున్నాం. రెట్రో స్టైల్లో బట్టలు కొత్త అందాన్ని తీసుకువస్తాయి. అందుకే ఇప్పుడు ఏ బట్టల దుకాణాల్లో చూసినా ఈ చీరలే కనిపిస్తాయి. ఆ చీరలకు వేర్వేరు పేర్లు ఉండచ్చు కానీ లుక్ మాత్రం రెట్రోనే..
ఎలాంటి ఫాబ్రిక్?
ప్రతి రోజు ధరించటానికి జార్జెట్, షిపాన్, నెట్‌లను వాడచ్చు. మామూలు కాటన్ చీరలలో కొద్దిగా మార్పులు చేసి ప్రతి రోజు వాడవచ్చు. ఫంక్షన్లకు, పార్టీలకు మాత్రం వెల్వెట్, కాటన్ సిల్క్, రా సిల్క్‌లను వాడాలి.
ఎలాంటి రంగులు?
పార్టీలకు వెళ్లేవారు ముదురు నియాన్ రంగులను వాడితే బావుంటుంది. ఈ రంగులు లైట్ల కాంతిలో మెరుస్తూ కనిపిస్తాయి. చామనఛాయ ఉన్నవారు మరి ముదురు రంగులు వేసుకోకూడదు. చీరలపై పెద్ద పెద్ద డిజైన్లు ఉంటే బావుంటుంది.
ప్రింట్ అండ్ ఎంబ్రైడరీ
పోల్కా డాట్స్‌కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద పువ్వులు, తీగలు, యానిమన్ బ్లాక్స్ చీరకు అదనపు అందాన్ని తీసుకువస్తాయి. ఈ చీరలకు జరీ, త్రెడ్ వర్క్‌లను వాడతారు. చిన్న చిన్న పువ్వుల నుంచి పెద్ద పెద్ద పువ్వుల దాకా రకరకాల రంగుల్లో కుడతారు. బాగా లావుగా ఉన్నవారు పెద్ద పెద్ద డిజైన్లను వాడకపోవటం మంచిది.
బ్లౌజులు
మనకు వింటేజ్ లుక్ రావాలంటే నెక్‌లైన్ పైకి ఉండాలి. డీప్ నెక్‌లు కాకుండా చిన్న కాలర్లు, పెద్ద కాలర్లు, బోట్ నెక్‌లను కుట్టించుకోవాలి. ఈ కాలర్లకు ఎంబ్రైడరీ చేయిస్తే ఇంకా బావుంటుంది. ఫుల్ స్లీవ్స్ కుట్టించుకుంటే బావుంటుంది. భిన్నంగా కనిపించాలనుకొనే వారు పఫ్ స్లీవ్స్‌ను కూడా కుట్టించుకోవచ్చు.