The 16 Most Powerful Foods, The top power foods for you, 10 Power Food Combos in telugu Version


పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 Healthfull foods,ఆరోగ్యవర్ధ ఆహారాలు : కొన్ని రకాల ఆహారాలు మిగిలిన వాటితో పోలిస్తే చాలా తేలికగా మనకు కావాల్సిన పోషకాలను అందించడములో సహాయపడతాయి. మిగిలిన వాటిలో కొన్ని పోషాకాలు ఉండవచ్చును లేదా లేకపోవచ్చును. ఈ ఆహార పదార్ధాలను మనము తప్పనిసరిగా తినాలి. . . మంచి ఆరోగ్యము కొరకు.

  1. జనప గింజలు ,
  2. గుడ్లు . ,
  3. వైన్‌ , 
  4. ముదురు రంగు చాక్లెట్ , 
  5. బీన్స్ , 
  6. బీట్ రూట్ , 
  7. వాల నట్స్ (ఆక్రోటు ),
  8. ధనియాలు , 
  9. చియా విత్తనాలు , 
  10. ఎర్ర క్యాబేజీ , 
  11. నీలం బెర్రీలు , 
  12. వెల్లుల్లి , 
  13. పార్సిలీ(కొత్తిమిరిలాంటిది ).,
  14. టర్నిప్స్ (ముల్లంగి లాంటి దుంప),
  15. బొమ్మిడాలు , 
  16. సజ్జలు , 
  17. కేల్ , 
  18. పుట్ట గొడుగులు , 
  19. గుమ్మడి విత్తనాలు , 
  20. ఓట్స్ , 
  21. తేనె , 
  22. పెరుగు , 
  23. అల్లము ,
  24. మెంతులు , 
  25. గోధుమ గడ్డి , 
  26. ఉసిరికాయలు .