కోకోనట్‌ మాక్‌టెయిల్స్‌, Preparation of Coconut Maktailes, Coconut Juice at home easy way



తాజా కొబ్బరి నీళ్లలో సా్ట్ర వేసుకుని తాగితే దాహం మాత్రమే తీరుతుంది. అలాకాకుండా కొబ్బరి నీళ్లకు కొత్త రుచులు జోడించి తాగితే ప్రత్యేకమైన పానీయం తాగిన తృప్తి మిగులుతుంది. అలాంటి వెరైటీ కోకోనట్‌ డ్రింక్స్‌ తయారీ ఎలా చేసుకోవాలో ఇక్కడ ఇస్తున్నాం. మీరూ ఓసారి ట్రై చేయండి.

(లిప్‌సిప్‌)
 
కోకోనట్‌ పైనాపిల్‌ డిలైట్‌
డ్రింక్‌ తయారీకోసం: పైనాపిల్‌ క్యూబ్స్‌ - 4 కప్పులు
తాజా కొబ్బరి నీళ్లు - 2 కప్పులు
లేత కొబ్బరి - 1 కప్పు
సుగర్‌ సిరప్‌ - 4 టేబుల్‌ స్పూన్లు
క్రష్‌డ్‌ ఐస్‌ - 1 కప్పు
ఫ్రూట్‌ వీల్స్‌ - 4 
ఎలా చేయాలి?
- ఐస్‌ తప్ప మిగతా వాటన్నిటినీ మిక్సర్‌లో వేసి తిప్పాలి. 
- గ్లాసుల్లో పావు కప్పు చొప్పున క్రష్‌డ్‌ ఐస్‌ వేసి సమాన కొలతల్లో జ్యూస్‌ నింపాలి.
- పైనాపిల్‌ వీల్స్‌ గ్లాసు అంచుల్లో అమర్చి సర్వ్‌ చేయాలి.

మెలన్‌ ట్యాంగో డ్రింక్‌ తయారీకి:
ఖర్బూజ పళ్ల ముక్కలు - 2 కప్పులు
బత్తాయి రసం - 2 కప్పులు
కొబ్బరి నీరు - 2 కప్పులు
పంచదార - 2 టీస్పూన్లు
బ్లాక్‌ సాల్ట్‌ - చిటికెడు
పుదీనా ఆకులు - కొన్ని
ఎలా చేయాలి?
- ఖర్బూజ ముక్కల్ని మిక్సీలో వేసి వడకట్టుకోవాలి.
- మిగతా ఇంగ్రిడియెంట్స్‌ అన్నిటినీ కలుపుకోవాలి.
- చల్లబరిచిన జ్యూస్‌ను గ్లాసుల్లో నింపి పుదీనాతో అలంకరించి సర్వ్‌ చేయాలి.
 
బ్లూ షార్క్‌ తయారీకి కావసినవి
లిచీ జ్యూస్‌ - అర కప్పు
నిమ్మరసం - ఒకటిన్నర కప్పు
కోకోనట్‌ వాటర్‌ - 200 మి.లీ
సుగర్‌ సిరప్‌ - 3 టేబుల్‌స్పూన్లు
ఫ్లేవర్డ్‌ సిరప్‌ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
ఐస్‌ క్యూబ్స్‌ - తగినన్ని
లేత కొబ్బరి - అలంకరణకు
ఎలా తయారుచేయాలి?
- అన్నిటినీ బాగా కలుపుకోవాలి.
- సర్వింగ్‌ గ్లాసుల్లో నింపుకుని లేత కొబ్బరి, ఐస్‌క్యూబ్స్‌తో అలంకరించి చల్లగా సర్వ్‌ చేయాలి.

కోకో మెలన్‌ మ్యాజిక్‌ తయారీకి కావసినవి
కొబ్బరి నీరు 2 కప్పులు
లేత కొబ్బరి - ఒక కప్పు
పుచ్చ కాయ ముక్కలు - 300 గ్రా
తేనె - 20 మి.లీ
పుదీనా - 5 గ్రా
బత్తాయి రసం - 50 మి.లీ
అల్లం రసం - 10 మి.లీ
తయారీ ఇలా:
పుదీనా తప్ప మిగతావన్నీ కలిపి ఫ్రిజ్‌లో చల్లబరుచుకోవాలి.
- పుదీనాతో అలంకరించి సర్వ్‌ చేయాలి.
 
కోకోపైన్‌ జంబో కావలసిన పదార్థాలు:
కొబ్బరి నీళ్లు - 45 మి.లీ
పైనాపిల్‌ జ్యూస్‌ - 30 మి.లీ
వెనిల్లా ఐస్‌క్రీమ్‌ - 1 టేబుల్‌స్పూన్‌
ఐసింగ్‌ సుగర్‌ - 1 టీస్పూన్‌
ఉప్పు - చిటికెడు
తయారీ విధానం
- కొబ్బరి నీళ్లు, పైనాపిల్‌ జ్యూస్‌ను మిక్సీలో వేసి కొన్ని సెకండ్లపాటు తిప్పాలి. 
- వెనిల్లా ఐస్‌క్రీమ్‌, ఉప్పు, ఐసింగ్‌ సుగర్‌ కూడా వేసి 3 నిమిషాలు మిక్సీ తిప్పాలి.
- మాక్‌టెయిల్‌ గ్లాసుల్లో చల్లగా సర్వ్‌ చేయాలి.