తేనె పేరు చెప్పగానే నోరూరుతుంది. దాని రుచి మనల్ని ‘మధురా’నుభూతుల్లోకి తీసుకెళ్లిపోతుంది. తేనెను రకరకాల డైట్స్‌లో ఉపయోగిస్తుంటాం. సహజమైన తీయదనం కోసం టీలో సైతం వాడుతుంటాం. తేనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవేంటో చూద్దామా...
. తేనెలో ఐరన్, కాల్షియం,ఫాస్ఫేట్, సోడియంక్లోరిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎన్నో ఉన్నాయి. సౌందర్యసాధనంగా తేనెను వాడతాం. గాయాల నొప్పి తగ్గడానికి కూడా ఉపయోగిస్తాం.
. తేనె చర్మాన్ని ఎంతో మృదువుగా చేస్తుంది. ముఖ్యంగా పొడిచర్మం ఉన్నవారికి ఇది మంచి మాయిశ్చరైజర్‌లాగా పనిచేస్తుంది. తేనె రాయడం వల్ల మోకాళ్లు, మోచేతులు నునుపుదేలతాయి.
. కేశాల పరిరక్షణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
. పగిలిన పెదాలపై తేనె రాసుకుని అరగంట సేపు అలానే ఉంచుకోవాలి. ఇలా చేస్తే పగుళ్లు పోయి పెదాలు మృదువుగా అవుతాయి.