7 Reasons behind the men & women before marrage, 7 tip for happy married life

 






 

దయ, జాలీ అనేవి కొన్ని అద్భుతాలను చేస్తుంది:

ప్రస్తుత రోజుల్లో జాలీ, దయ గుణాలు చాలా కొద్ది మందిలో మాత్రమే చూడగలుగుతున్నాము. ప్రస్తుత రోజుల్లో బిజీలైఫ్ లో కొన్ని పరిస్థితులను పూర్తిగా మర్చిపోతున్నాము. దయ చూపించడానికి ఎక్కువ శ్రమపడనవసరం లేదు, కేవలం అటువంటి ఆలోచన కలిగి ఉంటే చాలు, ఏదో ఒక సమయంలో అది సహాయపడుతుంది. అలా దయాగుణం కలిగి ఉండటం వల్ల ఎంతటి శక్తివంతమైనదో మీకే తెలుస్తుంది. అటువంటి గుణగణాలున్నప్పుడు మీ బంధాన్ని మరింత గొప్పగా మార్చుతుంది.

ప్రతి ఒక్కరూ చెడురోజులు ఎదుర్కొని ఉంటారు

మీ బాయ్ ఫ్రెండ్ కానీ, పార్ట్నర్ కానీ చెడు మూడ్ లో ఉన్నప్పుడు మీ వ్యక్తిగతంకు వ్యతిరేకంగా ట్రీట్ చేయనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఏదోఒక సందర్భంలో చెడురోజులు ఎదుర్కొని ఉంటారు మరియు జీవితంలో కొన్ని విషయాల్లో ఒత్తిడికి గురై ఉండవచ్చు . .అటువంటి సందర్భాల్లో ఎల్లప్పుడు మీ పార్ట్నర్ తో అంటిపెట్టుకుండటానికి వీలుపడకపోవచ్చు . మరియు అటువంటి సందర్భంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం కూడా ఊహించలేని విధంగా ఉంటుంది. అట్టి పరిస్థితుల్లో మీ పార్ట్నర్ లేదా బాయ్ ఫ్రెండ్ ను సమస్యలను ఎదుర్కోవడానికి మరియు పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి వదిలేయండి. మీ వ్యక్తిగతంగా తీసుకోకండి.

పబ్లిక్ లో అరవడం లేదా గొడవపడటం చేయకండి

ఒకటి లేదా కొన్ని సందర్భాల్లో ఇష్టం లేని వాటిని కూడా అంగీకరించాల్సి వస్తుంది. అటువంటప్పుడే సంబంధం స్ట్రాంగ్ గా మరియు దీర్ఘకాలం నిలబడుతుంది. చాలా మంది జంటలు ఏ సంబంధంలోనైనా ప్రధాన అంశంను లేదా భాగంను కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ , మీ సమస్యలను బహిరంగంగా పరిష్కరించుకోవాలనుకోకూడదు. మీరు బహిరంగంగా ఏది మాట్లాడినా అది మీకు అప్రతిష్టపాలు అవ్వడానికి అధిక మార్గం చూపుతుంది అది పిచ్చిగా కనిపిస్తుంది . మీ చెడు దుర్బాషలు బహిరంగంగా మాట్లాడకండి . మీకు ఇష్టంలేనివి ఇంట్లో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.

క్షమించడం ఒక గొప్ప విషయం

ఏ జంటల్లో అయితే ఫర్గివ్ నెస్ (ఒకరినొకరు క్షమించుకోవడాలు)ఉంటాయో వారి సంబంధాలు ఎక్కువ కాలం నిలబడుతాయి. ఎవరూ ఫర్ఫెక్ట్ కాదని మీరు అర్థం చేసుకోవాలి. మీ ఇద్దరూ తప్పులు చేస్తారు, అయితే ఆ తప్పులను నిజంగా అంగీకరించడం ఉత్తమ మార్గం. అయితే ఈ విషయంలో ఒకరిని మించి మరొకరు ఉంటే , మీ సంబంధంలో ప్రేమ కాలిపోతుంది. కాబటి, జీవితంలో సాధ్యమైనంత వరకూ క్షమాపణలతో మీ ప్రేమను ఎంజాయ్ చేయండి.

ఇద్దరూ కలిసి నవ్వుకోవడం చాలా అవసరం

మంచి భావాలు, ముఖ్యంగా నవ్వు మనస్సును సంతోషపరుస్తుంది మరియు జంటలను ఏకం చేస్తుంది . నవ్వు లోపల ఉన్న అడ్డంకుల్ని, ఒత్తిడిలను తొలగించేందుకు ఒక ఆయుదంగా ఉంది . మీకు తగిన జోకులు వేసుకోవడం ఇద్దరికి సహాయపడుతాయి. నిపుణుల ప్రకారం, నవ్వు వల్ల వృద్ధాప్య ప్రక్రియను నిధానం చేసే హర్మోన్లను ఉత్పత్తి చేస్తూ , మీ జీవితాన్ని మరికొంత కాలం పెంచుతుంది. ముఖ్యంగా ఎల్లప్పుడూ అనుకూలంగా మరియు మంచిగా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన మార్గం.

స్పష్టంగా మాట్లాడండి

అందరూ మీ మనస్సును తెలుసుకోలేరని గుర్తించుకోవాలి. ఎదుటి వారి మనస్సులో ఏముందో తెలుసుకోలేక, చాలా జంటలు ఒకరి మనస్సులు ఒకరు తెలుసుకోలేక నిరాశ చెందుతుంటారు. ఎదుటి వారి మనస్సును ఎందుకు తెలుసుకోవాలి?అలా తెలుసుకొన్నప్పడు స్పష్టంగా మాట్లాడుకోవడానికి సులభం అవుతుంది . అది మీ యొక్క సహనాన్ని మరియు సమయాన్ని సేవ్ చేస్తుంది .

బద్ధత భావన

కమిట్మెంట్ మీ ప్రేమను రుజువు చేస్తుంది అలాగే మీ ప్రియమైన వారి మీద మీకెంత ప్రేమ ఉందో చూపుతుంది. అందువల్లే మీ భావాలను మరియు మీ అవసరాలను ఎదుటి వారికి తెలియజేయాలి. మీ కమిట్మెంట్స్ కు విలువ ఇచ్చినప్పుడు మీ పార్ట్నర్ నిజంగా మీమీద ఆధారపడేలా చేస్తుంది. ఇది ప్రతి ఒక్క సంబంధంలో అవసరం అయినటువంటి ఒక ముఖ్య విషయం.

నియమ నిబంధనలు

ఒక సంతోషకరమైన మరియు సంబంధాలు దీర్ఘకాలం నిలబడటానికి కొన్ని నియమ నిబందనలు కలిగి ఉండాలి, కానీ ఒక మంచి రిలేషన్షింప్ ను మెయింటైన్ చేయడానికి ఆనియమాలకు కట్టబడి ఉండటానికి ప్రయత్నించాలి. ఇవి జీవితంలో వివిధ పరిస్థితుల్లో రీజనబుల్ గా మరియు తెలివిగా ఉండటం అవసరం.