Andhra Special Sweet at Diwali Festival must do.... Easy way to prepare diwali special sweets

భారతీయులు జరుపుకొనే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ దీపావళి. ఈ పండుగను రెండు మూడు రోజలు సెలబ్రేట్ చేసుకొంటారు. ప్రతి ఇల్లూ కుటుంబ సభ్యులతో పాటు బందువులు, స్నేహితులతో కళకళలాడుతుంటుంది. దీపావళి పండుగ రోజున రకరకాల రకరకాల పిండి వంటలు, స్నాక్స్, చేసి అథితులకు ఆథిధ్యం ఇస్తుంటారు. అయితే ఎప్పుడూ చేసేవే కాకుండా కొంచెం వెరైటీ చేసి పడితే ఇష్టంగా తినడమే కాకుండా మీకు ప్రశంసలు కూడా దక్కుతాయి.
స్నాక్స్ లో ప్రతి పండుగకు తప్పనిసరిగా చేసుకొనే వంటలు కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కాబట్టి కొన్ని సాధారణ వంటలు కొన్ని స్పెషల్ వంటలు మీకోసం...
షహీ టోస్ట్ అనేది ఇడియన్ స్వీట్ రిసిపి. ఈ బ్రెడ్ రిసిపి చాలా సులభం. మరియు అతి త్వరగా తయారైపోతుంది. ఈ రుచికరమైన షహీ టోస్ట్ ను పాలు, బ్రెడ్ మరియు డ్రై ఫ్రూట్స్ నట్స్ తో తయారు చేస్తారు. బ్రెడ్ తో తయారు చేసే ఈ స్వీట్ అందరికీ నచ్చుతుంది. పాలు తాగని మారం చేసే పిల్లలకు ఇది ఒక మంచి అవకాశం. ఇలా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు.

ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. వర్షాకాలంలో వాతావరణం చాలా చల్లగా.. చల్లగా కాదు చలిచలిగా ఉండి.. వేడి వేడిగా ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తుంటుంది. లేదా వేడి వేడి మసాల ఛాయ్ తాగాలనిపిస్తుంది. వర్షకాలంలో ఇటువంటి ఆలోచనలు రావడం సహజం అంతే కాదు వీటిని తీసుకొని వర్షాకాలంలో బద్దకాన్ని వదిలి రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది.మరి దీపావళి రోజున స్నాక్స్ తిని రిలాక్స్ అవ్వండి.

బోండా లేదా పకోడా వంటివి నూనెలో ఫ్రైచేసి ఈవెనింగ్ స్నాక్స్ గా తినేటటువంటి చిరుతిండ్లు.ఇండియన్ ఫ్రైయిడ్ స్నాక్స్ లో ఆలూ బోండా చాలా ఫేమస్ వంటకం. వీటిని సాయంత్ర సమయంలో టీ, కాఫీ లేదా టమోటో కెచప్ తో వేడివేడిగా తినవచ్చు. అంతే కాదు ఇంటికి వచ్చే అథితులకు కూడా అతి సులభంగా, అతి త్వరగా తయారు చేసి వండించేయెచ్చు . ఈ ఫేవరెట్ ఈవెనింగ్ టీ స్నాక్ ఆలూ బోండా ఎలా తయారు చేయాలో చూద్దాం....

స్పైసీ మిర్చీ బజ్జీ ఇండియన్ హాట్ స్నాక్. ఈవినింగ్ స్నాక్స్ లో అతి త్వరగా, సులభంగా తయారు చేసుకొనేది ఈ మిర్చీబజ్జీయే .వర్షాకాలంలో సన్నని వర్షపు జల్లుల మధ్య వేడి వేడి మిర్చీ బజ్జీ భలే రుచిగా ఉంటుంది. మిర్చీ బజ్జీ అంటే ఇష్టపడని వారుండరు. అయితే కొంత మంది మాత్రం పచ్చిమర్చిని తినడానికి బయపడుతుంటారు. పచ్చిమిర్చిలో విటమిన్ ఏ, సి, మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. బంగాళా దుంపలో పొటాషియం అధికంగా ఉంటుంది. అలాగే సి విటమిన్ కూడా అధికమే.

బ్రేక్ ఫాస్ట్ లలో వెరైటీగా, చూస్తానే తినేయాలనిపించి, నోరూరించే వంటకం కోకోనట్ కచోరి. కచోరి అంటే గుండ్రంగా అందులో మిశ్రమ పదార్థాలతో నిండుగా నింపి టేస్టీ గా ఉండే పఫ్డ్ ఇండియన్ బ్రెడ్ లాంటిది అనుకోవచ్చు. అయితే బ్రెడ్ కాదండోయ్.... కచోరీలను కొన్ని వరైటీలతో నింపి చేసుకొంటారు. కోకోనట్ మిశ్రమానికి బదులు, ఆలూ మిశ్రమం తో కూడా చేసుకొంటారు. అయితే కొబ్బరి మిశ్రమంతో తయారు చేసే అన్ని వంటలు చాలా పాపులర్ వంటకాలు కాబట్టి అదే ఫ్లేవర్ తో మరో వెరైటీ వంటకం బ్రేక్ ఫాస్ట్ మీ కోసం...

ప్రతి పండక్కీ మసాలా వడ ఇంట్లో ఘుమఘుమలాడాల్సిందే. అలాగే దీపావళికి కూడా... చాలా మంది అతి ఇష్టంగా తింటారు ఈ మసాలా వడ. చేయడం కొద్దిగా కష్టమే అయినా.. సమయం తీసుకొన్నా తినడానికి రుచి మాత్రం భలేగా ఉంటుంది. మరి ఈ దీపావళి రోజు తియ్యటి స్వీట్ తో వడను కూడా లాగించేయండి.