దీపావళి వచ్చేసింది..కళ్ళు మిరుమిట్లుగొలేపే దీపకాంతులతో ఇల్లంతా రంగురంగుల రంగోలీలతో..ఇంటినిండా బందువులు, స్నేహితులతో చాలా ఆడంభరంగా జరుపుకొనే దీపావళి. హిందువులు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. దీపావళి స్పెషల్ దీపాలంకరణ, లక్ష్మీ పూజ, రకరకాల పిండి వంటలు, స్వీట్స్ తో అందరినీ ఆనందపరచడమే. చిన్న పెద్ద, అని లేకుండా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే ఈ దీపావళికి కొన్ని రకాల స్వీట్స్ తో ఆథిధ్యం ఇస్తే అథితులు మోచ్చుకోక ఉండలేరు.
చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళీ. పండగ రోజున నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ.
ఉత్తర భారతదేశంలో ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. విద్యుత్ దీపాళంకరణ ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ప్రతి ఇంట్లోను రంగవల్లులు, పిండివంటలు, కొత్తబట్టలు, బందువులు, స్నేహితులు కిటకిటలాడుతుంటుంది. లక్ష్మీ పూజతో మొదలు పెట్టి టపాకాయలు కాల్చడంతో పూర్తి అవుతుంది. ఈ దీపావళికీ అథితులకు, కుటుంబ సభ్యలకు అత్యంత ఇష్టమైన రకరకాల స్వీట్స్ మీ కోసం....
1. దీపావళి స్పెషల్ జిల్ జిల్ జిలేబి: చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళీ. పండగ రోజున నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. అలాగే దసరా, దీపావళి వస్తున్నాయంటే పిండి వంటల తయారీకి సమయం ఆసన్నమైందనే అర్థం. చుట్లు, చుట్లుగా అందంగా మెరుస్తూ ఉండే తీపి వస్తువేంటి. అది నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. ఈ స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్లు చాలా తక్కువేమో..గుర్తొచ్చిందా?? అదేనండి.. జిలేబి. భారతదేశంలోని దాదాపు అన్ని ప్రదేశాలలో తప్పక కనిపించే ఈ జిలేబి ఎలా చేయాలో చూద్దామా...
2. ట్రెడిషినల్ పాయసం: పాయసం అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే భారతీయ సాంప్రధాయంలో ఏ కార్యానికైనా ముందు తీపి రుచి అందిస్తారు. వాటిలో పాయసం కూడా ఒక్కటి ముఖ్యంగా పండుగలు వచ్చాయంటే చాలు అందరిళ్ళలోనూ పాయసం ఘుమఘుమలే. పాయసంను వివిధ రకాలుగా వండుతుంటారు. ఎన్నో వెరైటీల పాయసాలు ఉన్నా సేమ్యా సగ్గుబియ్యం వేసి చేసే ఈ పాయసం చాలా ట్రెడిషనల్ ముఖ్యంగా సేమియాలతో చేసే పాయసం చాలా అద్బుతంగా ఉంటుంది.
3. నోరూరించే గులాబ్ జామూన్: జామూన్స్ పేరు చెపితే, తియ్యగా నోరు ఊరి పోతుంది. తినటానికే కాదు చూసేటందుకు కూడా ఈ పన్నీర్ జామూన్స్ ఎంతో ఇంపుగా వుంటాయి. తయారీ చాలా తేలిక. మరి పన్నీర్ తో కలిపిన ఈ జామూన్స్ చేయటం ఎలానో చూడండి.
4. గుజియా: కోకోనట్ గుజియా పర్ ఫెక్ట్ ఇండియన్ డిసర్ట్. ఇది ట్రెడిషినల్ స్వీట్. అన్ని శుభకార్యాలకు, పండగలకు ఈ స్వీట్ ను ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ స్పెషల్ స్వీట్ రిసి కొబ్బరి తురుముతో తయారు చేసి షుగర్ సిరఫ్ లో వేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. కోవా బదలుగా పాల పొడిని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు.
5. చూర్మా లడ్డు: పండుగలు వచ్చాయంటే చాలు ఏమేమి పిండి వంటలు వండాలి. దేవుడికి ఏవేవి నైవేద్యం పెట్టాలి. ఇంటికొచ్చే అథితులకు ఏమి ఆతిథ్యం ఇవ్వాలని చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు. ఏవైనా వెరైటీగా చేస్తే బాగుండు అనుకుంటారు. మరి ఈ దీపావళికి చూర్మా లడ్డు రుచి చూద్దామా...
6. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే సోన్ పప్పిడి: భారతీయు జరుపుకొనే అతి పెద్ద పండుగ దీపావళి. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను అంత్యంత వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు. విద్యుత్ దీపాళంకరణ ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. ప్రతి ఇంట్లోను రంగవల్లులు, పిండివంటలు, కొత్తబట్టలు, బందువులు, స్నేహితులు కిటకిటలాడుతుంటుంది. లక్ష్మీ పూజతో మొదలు పెట్టి టపాకాయలు కాల్చడంతో పూర్తి అవుతుంది. ఈ దీపావళికీ అథితులకు, కుటుంబ సభ్యలకు అత్యంత ఇష్టమైన స్వీట్ మీ కోసం....
7. దీపావళి స్పెషల్ కుస్ కుస్ అరిసెలు: దీపావళి పండుగ రోజున భారతీయులు వివిధ రకాల సంప్రదాయ పిండి వంటలు తయారుచేసుకుంటారు. ఇవి నాటి నుంచి నేటి వరకు స్వీట్స్ ప్రియులను పూర్తిగా సంతృప్తి పరుస్తున్నాయి. దీపావళి అనగానే ముఖ్యంగా గుర్తువచ్చేది అత్తిరాసము(అరిసెలు). బియ్యంపిండి, బెల్లంతో తయారు చేస్తారు. అందులో కొంచెం వెరైటీ గసగసాలు కలిపితే ఆ టేస్టే వేరు. దీపావళి పండుగ రోజున వీటిని ప్రత్యేకంగా తయారుచేసుకొని దేవునికి నైవేద్యంగాను సమర్పిస్తారు. అలాగే వచ్చిన అథిధులకు మొదటగా వడ్డించి వారి నోరు తీపి చేసి వారిని మైమరపించి వారి ఆత్మీయతకు ప్రీతి పాత్రులవుతారు.
English VERSION :