చిన్న పిల్లల్లో ఇన్ఫెక్షన్ తొలగించే 10 సూపర్ ఫుడ్స్, Amazing 10 food for kids for save infection, good food for kids, seasonal food,











సాధారణంగా చిన్న పిల్లలు తరచుగా జబ్బున పడుతుంటారు. అందుకు ముఖ్య కారణం వాతావరణంలోని మార్పులు, దానికితోడు వాతావరణంలో మార్పులతో పాటు వారిలో వ్యాధినిరోధకత లోపించడం. పిల్లల్లో వ్యాధినిరోధకతను పెంచాలంటే తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారంను అందివ్వాలి.ఈ హెల్తీ ఫుడ్స్ పిల్లల ఆరోగ్యంగా ఉండటానికి మరియు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతాయి.
ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా అలర్జీలు, ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర సాధరణ జబ్బులు అజీర్ణం వంటి జబ్బుల బారీన పడుతుంటారు. ఈ సాధారణ జబ్బులను ఎదుర్కోవడానికి పిల్లలకు మరింత ఎక్కువ శక్తి- సామర్థ్యాలు అవసరం అవుతాయి.
వేసవికాలంలోనే కాదు, చలికాలంలో కూడా, వాతావరణంలోని హ్యుముడిటి వల్ల జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడుతాయి. అందువల్ల పిల్లల్లో వ్యాధినిరోధకతను నిరోధించడానికి ఇన్ఫెక్షన్స్ ను అరికట్టడానికి ఆరోగ్యరమైన ఆహారాలను పిల్లలకు అందివ్వాలి. మరి పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎదుర్కోగలిగే ఆహారాలను ఈక్రింది స్లైడ్ లో తెలుపబడినవి క్లిక్ చేసి చూడండి...

నీరు:

పిల్లలకు ఇచ్చే నీరు ముఖ్యంగా వాటిని కాచీ చల్లార్చినవై ఉండాలి. ఇంట్లోనే కాదు, వారు స్కూల్ కు వెళ్ళేటప్పుడు కూడా వేడి నీళ్ళబాటిల్ నే పంపాలి. చలికాలంలో శరీరంలో హైడ్రేషన్ కు గురి కావడానికి వాతావరణంలో హ్యుమిడిటియే కారణం అందుకోసం వేడినీళ్ళు త్రాగడం మేలైన మార్గం.

ఆవిరి మీద ఉడికించినవ ఆహారాలు:

 హెల్తీ ఫుడ్స్ ఎల్లప్పుడు ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తాయి. కాబట్టి, పిల్లకు ఆవిరిమీద ఉడికించిన ఆహారాలు లేదా గ్రిల్ చేసి ఆహారాలను అందివ్వాలి. ఫ్రైడ్ ఫుడ్స్ ను పిల్లలకు పెట్టడం నివారించాలి . ఈ ఆహారాలు వారి వ్యాధినిరోధకత మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి వారి ఇన్ఫెక్షన్స్ కు దూరంగా ఉండేలా చూసుకోవాలి.

యాంటీఆక్సిడెంట్స్:

యాంటీఆక్సిడెంట్ ఫుడ్స్ పిల్లల రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చాలి . ఇది వారి యొక్క వ్యాధినిరోధకతను పెంచతుుంది. అన్ని రకాల జబ్బులను దూరం చేస్తాయి. అందుకు బీరకాయ, కాకరకా, పొట్లాకా, సొరకాయ, గుమ్మడి, క్యాస్పికమ్ మరియు బెర్రీస్ వంటి వాటి పిల్లలకిచ్చే డైట్ లో ఎక్కువగా చేర్చాలి.

హోం మేడ్ జ్యూస్ లు:

పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ను నివారించే హెల్తీ ఫుడ్ హోం మేడ్ జ్యూసులు. రోడ్ల సైడ్ అమ్మేటటువంటి జ్యూసులు లేదా పండ్లు లేదా పండ్ల రసాలను పిల్లలకు తీసివ్వకండి . స్వయంగా ఇంట్లోనే తయారుచేసి అందివ్వండి. దీనివల్ల వాటర్ బోర్న్ డిసీజస్ ను అరికట్ట వచ్చు.

పండ్లు:

పండ్లు పిల్లలకు చాలా ఆరోగ్యకరమైన ఆహారాలు. ముఖ్యంగా పిల్లలకు దానిమ్మ, అరటి లేదా పీచ్ వంటి పండ్లను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చాలి. సిట్రస్ పండ్లలో వ్యాధినిరోధకతను పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

కూరగాయలు:

కూరగాయలు కూడా పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి సహాయపడుతాయి.అయితే వాటిని వండేటప్పుడు తగినంత జాగ్రత్త వాటిని శుభ్రంగా కడిగి తర్వాత ఉపయోగించాలి. ఎందుకంటే హానికర రసాయనాలు, పురుగుల మందుల వాడటం వల్ల అవి పిల్లల్లో మరింత హాని కలిగిస్తాయి.

బాగా వండిన ఆహారాలు :

సాధ్యమైనంత వరకూ పచ్చిఆహారాలను అందివ్వకండి. ముఖ్యంగా ఇది మాంసాహారలుకు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే, సరిగా ఉడికించని మాంసం లేదా గుడ్డు పిల్లల్లో మరింత హాని కలిగిస్తాయి.

మాంసాహారాలు:

పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ను నివారించే ఆహారాల్లో ఇది ఒకటి . ఇక్కడ తరిగి కుక్కింగ్ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వీటిని వండేటప్పుడు బాగా శుభ్రంగా కడిగి తర్వాత వండాలి. సగం ఉడికిన లేదా ఉడకని పచ్చి ఆహారాలను పిల్లలకు అందివ్వకూడదు . వారికి స్టొమక్ అప్ సెట్ అవ్వొచ్చు.

విటమిన్ సి:

పిల్లలకు ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహారం. ఆరెంజ్ జ్యూస్, కివి లేదా ఇతర విటమిన్ సి ఉన్న ఆహారాలను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల వారిని బలంగా మార్చతుంది. మరియు వారిలో వ్యాధినిరోధకతను పెంచుతుంది.

సప్లిమెంట్స్:

వైద్యుల సలహా అనుసరించి వారికి సప్లిమెంట్స్ ను అందివ్వవచ్చు . ఇవి వారికి అవసరం అయ్యే విటమిన్స్ అందివ్వడంతో పాటు వ్యాధులను అరికడుతాయి.