మన ఇండియాలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు కాంతివంతమైన చర్మం సౌందర్యం, పొడవాటి, మెరిసేటి జుట్టు మరియు పెద్దగా...అందంగా ఉన్నటి వంటి కళువ కళ్ళుకలిగి ఉంటారు.
చాలా వరకూ సౌత్ ఇండియన్ మహిళలు గమనించినట్లైతే వారు పురాతన కాలం నుండి ఆఛారా వ్యవహారాలే మరియు సాంప్రదాయలను అనుసరిస్తుండటం వల్లే వారికి, ప్రకాశవంతమైన చర్మం సౌందర్యం కేశ సౌందర్యం ఇనుమడించినదని చెప్పవచ్చు. ముఖ్యంగా దక్షిణ భారత స్త్రీలు వారి సౌందర్యం మెరుగుపరచుకోవడం కోసం కొన్ని నేచురల్ పద్దతులను పురాతన కాలం నుండి అనుసరిస్తున్నారు . వారు అంత అందంగా కనబడుటకు అదే వారి సౌందర్య రహస్యం! మరి సౌత్ ఇండియన్ మహిళ బ్యూటీ వెనుక దాగి ఉన్న రహస్యాలేంటో ఒకసారి చూద్దాం...
కొబ్బరిని ఉపయోగించడం:
దక్షిణ భారత దేశపు వారు వారి రెగ్యలర్ డైట్ లో కొబ్బరిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అంతే కాదు వారి సౌందర్య పోషణలో కూడా కొబ్బరి యొక్క పాత్ర ఉందనే చెప్పవచ్చు. కొబ్బరినీళ్ళు తరచూ త్రాగడం వల్ల ముఖంలో సహజత్వ కాంతిని ప్రకాశించేలా చేస్తుంది . కొబ్బరిల అధిక ఫైబర్, విటమిన్స్, న్యూట్రీషియన్స్, మరియు మినిరల్స్ కలిగి ఉంది. అందుకే దీన్ని వివిధ రాకల వంటల్లో (చట్నీ, కొబ్బరి రైస్, ఊరగాయలు, మరీ ముఖ్యంగా కొంత మంది కొబ్బరి నూనెను వంటలకు తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు.మీరు ఇప్పటి వరకూ ఉపయోగించుకుండా ఉన్నట్లైతే కొబ్బరిని ఉపయోగించడం మొదలు పెట్టండి. ఎక్కువ ప్రయోజనాలను పొందండి .
యోగ:
సౌత్ ఇండియన్ మహిళలు ముఖ్యంగా వారు శరీర ఆకృతికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తుంటారు, అందుకు ఒక పెద్ద రహస్యమే ఉంది, వారి శరీరం ఫిట్ గా నాజుగ్గా ఉండటానికి యోగాయే వారి రహస్యం. యోగ ఒక శక్తివంతమైన మాధ్యమిక వ్యాయామం వంటింది. మనస్సును ప్రశాతంగా మార్చుతుంది. చర్మంను శుభ్రపరచుకోవడం మరియు సుననితపరచుకోవడం వల్ల ముఖంలో కాంతి ప్రకాశిస్తుంది , మనస్సు ప్రశాంతపరుస్తుంది మరియు శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. యోగ వల్ల ముఖంలో ముడుతలు మరియు వృద్దాప్య లక్షణాలు, మొటిమలు, అసాధార జీర్ణక్రియ మరియు ఇతర సమస్యలు నివారించబడుతాయి.
ఆయుర్వేద:
సౌత్ ఇండియాలో మహిళలు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ లో చాలా వరకూ ఆయుర్వేదిక్ ఫేస్ ఫ్యాక్ సహజంగా ఉంటాయి. ఆయుర్వేదం వల్ల అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నది మరియు దీని వల్ల ఒక ముఖ్యమైన ప్రయోజనం, చర్మానికి ఎటువంటి డ్యామేజ్ కలగనివ్వకుండా ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం మరియు చర్మకాంతిని అందిస్తుంది.
మసాజ్:
సౌత్ ఇండియాల లోకల్ రెసిడెన్స్ లో మసాజ్ థెరఫీలు చాలా పాపులర్ , కానీ మన దేశంలో ఇతర ప్రదేశాల్లో కూడా బాగా పాపులర్ అయినాయి. ఒక ట్రెడిషినల్ సౌత్ ఇండియన్ మసాజ్ లో అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఈ ప్రయోజనాలు కేవలం చర్మం మరియు కేశాల మీద మాత్రమే కాదు, మొత్తం జీవక్రియల మీద పనిచేస్తుంది. మీరు ఇలా మసాజ్ సెంటర్లకు వెళ్ళలేకపోతే, ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు కొబ్బరినూనెతో శరీరాని మసాజ్ చేయాలి . ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుగా ఉంటుంది. దాంతో సాష్ట్ అండ గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది.
కళ్ళు:
దక్షిణ భారత దేశ స్త్రీలకు కళ్ళు పెద్దగా మరియు నల్లగా అందంగా ఉంటాయి. దానికి తోడు కళ్ళు నిండుగా కాటుకు దిద్దుకోవడంతో సాంప్రదాయ కళ ఉట్టిపడుతున్నట్లు కనిపిస్తుంటారు.కళ్ళు అందంగా బ్రైట్ గా కనిపించడానికి కళ్ళకు నువ్వుల నూనెను అప్లై చేస్తుంటారు.
ఆరోమా థెరఫీ ఫేషియల్స్:
సౌత్ ఇండియన్ బ్యూటీస్ కు హోం ఫేషియల్స్ చాలా సర్వసాధారణంగా వేసుకుంటుంటారు. ఆరోమాటిక్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్, క్లీన్ చేసి, హైడ్రేషన్ లో మరియు సున్నితంగా ఉంచుతుంది . ఈ ఫేషియల్స్ చర్మం అవతలి వైపు మాత్రమే కాదు, మనస్సు ప్రశాంతపరుస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరచి, శరీరంలో టాక్సిన్స్ తొలగించి చర్మం కాంతిని పెంచుతుంది, ముఖంలో ముడుతలను, ముఖంల వాపును నివారించి ప్రకాశవంతంగా మెరిసేటి చర్మఛాయను అందిస్తుంది.
మంచి జీవన శైల:
ఒక మంచి ఆరోగ్యానికి ఒక మంచి జీవనశైలి కారణం అవుతుంది. ప్రతి రోజూ కనీసం 6నుండి 8గంటల సమయం నిద్రపోతారు, తిరిగి ఉదయాన్నే నిద్రలేచి, సమయానికి మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. మంచి జీవనశైలి ఉన్నప్పుడు,అంతర్గతంగా మరియు బహిర్గతంగాను మంచి ఆరోగ్యంను మరియు సౌందర్యంను సొంతం చేసుకుంటారు.
కేశ సంరక్షణ:
సహజంగా దక్షణభారతదేశ స్త్రీలకు నేచురల్ మరియు మందపాటి నల్ల జుట్టును కలిగి ఉంటారు . మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అందుకు కొన్ని పద్దతులను ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది .
1. రెగ్యులర్ గా తలకు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది.
2. రెగ్యులర్ గా మీ జుట్టుకు తలస్నానం చేస్తుండాలి. షాంపు మాత్రం వారంలో రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి.
3. బ్రహ్మీ మరియు ఆమ్లాతో తయారుచేసినటువంటి షాంపులను ఉపయోగించాలి. కఠినమైన రసాయనాలతో తయారుచేసిన షాంపులను నివారించాలి.
జుట్టుకు హోం రెమెడీస్ :
ఒక వేళ మీ జుట్టు నిర్జీవంగా ఉన్నట్లు కనుగొన్నట్లైతే, మీ వంటగదిలోని పోపుల పెట్టెను తెరవండి చాలు బ్యూటిఫుల్ హెయిర్ పొందడానికి వివిధ రకాల వస్తువులు లేదా పదార్థాలు వంటగదిలోనే దొరుకుతాయి. అటువంటి సింపుల్ రెమెడీస్...
1. పెరుగును జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. చిక్కగా మరియు మంచి షైనింగ్ తో ఉండే జుటకు పొందాలంటే పెరుగు ఒక గొప్ప మార్గం.