కాలీఫ్లవర్ మరియు ఇతర ఆరోగ్యకరమైన వెజిటేబుల్స్ కు ఇది ఒక మంచి సీజన్. కాబట్టి, ఈ అవకాశన్ని వినియోగించుకోండి. ఈ ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన గ్రీన్ వెజిటేబుల్స్ నోరూరిస్తుంటాయి. అటువంటి గ్రీన్ వెజిటేబుల్స్ లో కాలీఫ్లవర్ ఒకటి. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యప్రయోజనాలను కూడా అధికంగా కలిగి ఉంది. కాలీఫ్లవర్ లో విటమిన్ సి, లోఫ్యాట్, పుష్కలంగా ఉండి క్యాన్సర్ తో పోరాడుతుంది మరియు ఇందులో పైబర్ అధికంగా ఉంటుంది. అందువల్లే ఈ రోజు మనం ఈ కాలీఫ్లవర్ తో రుచికరమైన వంటను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...
కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ లేదా గోబీ ఫ్రైడ్ రైస్, ఈ రైస్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. మరింత రుచికరంగా ఉండటానికి కొన్ని మసాలాదినుసులను ప్రత్యేకంగా ఈవంటలో చేర్చడం వల్ల అద్భుతమైన రుచిని అంధిస్తుంది. మరి ఈ రుచికరమైన వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
బాస్మతి రైస్: 2cups(వండిపెట్టుకోవాలి)
కాలీఫ్లర్: 1/2పువ్వు(విడిపించి లేదా కట్ చేసి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
జీలకర్ర: 1/2tbsp
కారం: 1/2tbsp
పసుపు: 1/4tsp
దాల్చిన చెక్క: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడిచేయాలి. వేడి అయ్యేక అందులో జీలకర్ర, దాల్చిన చెక్క మరియు లవంగాలు వేయాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలి.
3. పోపు వేగిన తర్వాత అందులో కారం, పసుపు, మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి.
4. తర్వాత అందులోనే కాలీఫ్లవర్ వేసి మొత్తం మిశ్రమం మిక్స్ చేస్తూ మీడియం మంట మీద 10నిముషాలు వేగించుకోవాలి.
5. గోబీ గోల్డ్ బ్రౌన్ కరల్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
6. గోబీ మెత్తగా మారిన తర్వాత అందులో ముందుగా వండి పెట్టుకొన్న అన్నం వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూనే 5-6నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.అంతే గోబీ రైస్ రిసిపి రెడీ.