బాలింతలు తినాల్సినటువంటి 6 సూపర్ ఫుడ్స్, Best Food for Pregnent women, Food for Pregnent lady, Amazing Good food for womens







సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చాక బాలింతలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే పెడతారు. ఆ సమయంలో జీర్ణమైన ఆహారం మాత్రమే శిశువుకు పాలుగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ సమయంలో బాలింతలు తగు జాగ్రత్తులు పాటిస్తూ తీసుకునే ఆహారం పుష్టికరంగా, ఆరోగ్యవృద్దికరంగా ఉండేలా చూసుకోవాలి. ప్రసవం జరిగిన తొలిరోజుల్లో ఎక్కువగా పులుపు, కారం, మసాలాలను తీసుకోకూడదు. గర్భవతిగా ఉన్నప్పుడే కాదు, ప్రసవం తర్వాత కూడా కొత్తగా తల్లి అయిన స్త్రీలకు నియమిత ఆహారం ఎంతో అవసరం. శిశువు జన్మించిన ఆరు నెలల వరకూ తల్లిపాలే శిశువులకు పోషకాహారం. శిశువు తాగే పాలు తేలికగా జీర్ణించుకుని ఆరోగ్యవంతంగా దినదినాభివృద్ది చెందాలంటే తల్లి తగిన జాగ్రత్తలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. దీంతో తల్లీ, బిడ్డల ఆరోగ్యం చక్కగా ఉంటుంది.
మీరు తీసుకొనే ఆహారపు అలవాట్లు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకొనే ఆహారం మీదే మీ బేబి పెరుగుదల ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకొనే పౌష్టికాహారంతోనే బిడ్డకు సరిపడా ఫీడింగ్ చేయవచ్చు. శిశువుకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే సమయంలో సరైన న్యూట్రిషియన్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. పౌష్టికాహార లోపం వల్ల ఆ ప్రభావం శిశువు మీద చూపెడుతుంది. మీరు తీసుకొనే ఆహారం పరిమాణంలో కంటే పోషకవిలువల నాణ్యత చూడాలి. సాధారణ ఆహారం లేదా హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం వల్ల అది మీకు కానీ, మీ శిశువు కానీ ఎటువంటి ప్రయోజనం కలిగించదు. మరి ప్రసవం తర్వాత కొత్తతల్లి తీసుకోవాల్సిన పోస్ట్ నేటల్ డైట్ సూపర్ ఫుడ్స్ క్రింది స్లైడ్ లో చూడండి. ఇవి అటు కొత్తగా తల్లైన వారికి మరియు వారి శిశువు ఆరోగ్యానికి చాలా మంచిది.
పోస్ట్ నేటల్ డైట్ సూపర్ ఫుడ్స్:
1. గుడ్డు: గుడ్డులో మంచి క్రొవ్వులు మరియు ప్రోటీనులు మరియు క్యాల్షియం తగినన్ని ఉంటాయి కాబట్టి ఈ పౌష్టికాహారం ప్రసవం తర్వాత తల్లికి చాలా అవసరం. వీటిని ప్రతి రోజూ ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల తగినంత శక్తి పొందగలుగుతారు. హార్మోనుల అసమతుల్యతను క్రమబద్దం చేస్తుంది.
2. ఓట్ మీల్: ఇది చాలా చాలా సులభంగా జీర్ణం అయ్యే ఆహారం మాత్రమే కాదు ఇందులో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ కొత్త తల్లికి చాలా అవసరం. ప్రసవం తర్వాత మలబద్దకంతో బాధ పడే వారికి ఇది ఒక మంచి సహాయకారిని. అలాగే ఇందులో పుష్కలంగా ఉండే ఐరన్ కంటెంట్ వల్ల ప్రసవించిన తల్లిలో రక్తహీనత లేకుండా చేస్తుంది . అలాగే ఓట్ మీల్ కొత్త తల్లిలో బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుంది.
3. సాల్మన్: చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ సాల్మన్ మరియు తున చేపల్లో ఎక్కువగా కనుగొనబడింది. ఇది మీ శిశువు యొక్క బ్రెయిన్ మరియు కళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి, పాలు పట్టే తల్లులు వారంలో రెండు సార్లు ఇటువంటి చేపలను ఆహారంగా తీసుకోవడం ఉత్తమమైన మార్గం.
4. బ్రౌన్ రైస్: బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే కొత్తగా తల్లైన వారు వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం . బ్రౌన్ రైస్ కొత్త తల్లికి కావల్సినంత ఎనర్జీని అందిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. మరియు ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. మరియు వైట్ రైస్ లో కంటే బ్రౌన్ రైస్ లో ఎక్కువ పోషకాంశాలుంటాయి. మరియు బ్రౌన్ రైస్ బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుంది. మరియు ఇది జీర్ణం అవ్వడానికి సులభం అవుతుంది.
5. బ్లూ బెర్రీస్: కొత్తగా తల్లైన వారు, వారి రెగ్యులర్ డైట్ లో యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. అటువంటి ఆహారాల్లో బ్లూ బెర్రీస్ ఒకటి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. అలాగే మీ శిశివుకు ఎటువంటి వ్యాధులు సోకుండా రక్షణ కల్పిస్తాయి . మరియు బ్లూ బెర్రీస్ లో ముఖ్యమైన విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కొత్తగా తల్లైన వారికి చాలా అవసరం అవుతాయి.
6. ఆకుకూరలు: ప్రసవం తర్వాత హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ఎంతైనా అవసరం. కొత్త తల్లి ఒక సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆకుకూరల్లో కూరలో అధికంగా ఐరన్ మరియు విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇవి కొత్తగా తల్లైన వారికి, తిరిగి ఆరోగ్యాన్ని యథావిథిగా అందిస్తుంది. ప్రసవ సమయంలో కోల్పోయిన పోషకాంశాలను తిరిగి శరీరానికి అందిస్తుంది.