Weekend special recipes at home made, Easy way preparation of Special receipes,






చలికాలంలో స్పైసీగా నాన్ వెజ్ తీసుకోవాలంటే మటన్ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. మటన్ శరీరంలో వేడి కలిగిస్తుంది. దానివల్ల శరీరం చలికాలానికి సూటబుల్ గా ఉంటుంది . చలికాలంలో మన శరీరం తగినంత వెచ్చదనం కోరుకుంటుంది.
మటన్ ను వివిధ రకాలుగా వండుకోవచ్చు . కడై మటన్ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఇండియన్ మసాలాదినుసులను ఉపయోగించి తయారుచేస్తారు మరియు మటన్ ముందుగానే మ్యారినేట్ చేసి ఫ్రై చేయడం వల్ల చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఇది పంజాబీయుల డిష్. తీన్ని తయారుచేయడం చాలా సులభం.
మటన్ కడై లేదా మటన్ ఘోస్ట్ చాలా సులభంగా త్వరగా తయారుచేయవచ్చు . దీన్ని తయారుచేయడానికి ప్రెజర్ కుక్కర్ ను కూడా ఉపయోగించవచ్చు . మరి ఈ మటన్ కడైరిసిపిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...
కావల్సిన పదార్థాలు: 
మటన్: 250grm
టమోటో: 2(సన్నగా కట్ చేయాలి)
ఉల్లిపాయ పేస్ట్: 1/4cup
అల్లం పేస్ట్: 1/2tbsp
వెల్లుల్లి పేస్ట్: 1/2tbsp
జీలకర్ర: 1/2tbsp
పచ్చిమిర్చి: 3
పెరుగు: 1/4cup
గరం మసాలా : 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1/2tsp
బిర్యానీ ఆకు: 2
నూనె: 3tbsp
తయారుచేయు విధానం: 
1. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి తర్వాత పెరుగు మరియు ఉప్పుతో మ్యారినేట్ చేసి 20 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి వేగించి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పడు అదే పాన్ లో మటన్ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకొని ఒకగిన్నెలోనికి తీసి పక్కన పెట్టుకోవాలి. 
4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అందులో జీలకర్ర వేసి ఒకనిముషం వేగించుకోవాలి.
5. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి మరికొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడుఅందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 2-3నిముషాలు వేగించుకోవాలి.
7. తర్వాత టమోటో, ధనియాలపొడి, గరం మసాలా, కారం, పసుపు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మరో 5-10నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. ఇప్పుడు అందులోనే మ్యారినేట్ చేసుకొన్న మిశ్రమాన్ని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి 
9. తర్వాత మటన్ ముక్కలు వేసి మొత్తం మిశ్రమాన్నికలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 15-20నిముషాలు మీడియం మంట మీద మటన్ పూర్తిగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి. 
10. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత అందులో ఫ్రై చేసుకొన్న పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే మటన్ కడాయ్ రిసిపి సర్వ్ చేయడానికి రెడీ.