Healthy Oats And Coconut Dosa Recipe, Health break Fast for Childre, Amazing benefits with Oats And Coconut, South receipies,


ఓట్స్ కోకనట్ దోసె రిసిపి హెల్తీ అండ్ టేస్టీ రిసిపి. డిఫరెంట్ దోసెల్లో ఈ దోసె చాలా సులభమైనటువంటి దోసె. దీన్ని ఇంట్లో చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. మీ హెల్తీ డేను ప్రారంభించడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ దోసె రిసిపి . ఓట్స్ దోసెను ఎక్కువగా సౌత్ ఇండియాలో తయారుచేసుకుంటారు . ఇది సాధారణ దోసెలాగా ఉండదు.
ఒకే రకమైన దోసె రిసిపిని తిని బోరుకొడుతుంటే, ఇలా వెరైటీగా హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని తయారుచేసుకొని తినవచ్చు. హెల్తీ డే కొరకు కోకనట్ ఓట్స్ దోసెను ప్రయత్నించవచ్చు . ఓట్స్ కోకనట్ రిసిపి వెజిటేరియన్ రిసిపి. ఇది పొట్ట నింపుతుంది, త్వరగా ఆకలి కానివ్వదు. ఈ ఓట్స్ దోస రిసిపికి కొబ్బరి చట్నీ మరియు సాంబార్ మంచి కాంబినేషన్ .
కావల్సిన పదార్థాలు: 
బియ్యం పిండి: 1cup
గోధుమ పిండి: 1cup
ఓట్స్ పౌడర్: 1cup
కొబ్బరి తురుము : 1/4cup
పచ్చిమిర్చి: 2
పెప్పర్ పౌడర్: 1/2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారుచేయు విధానం: 
1. ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, గోధుమపిండి, ఓట్స్ పౌడర్, పచ్చిమిర్చి, కొబ్బరి, పెప్పర్ పౌడర్, మరియు ఉప్పు మరియు నీళ్ళు వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి.
2. మరుసటి రోజు ఉదయం పాన్ తీసుకొని స్టౌ మీద పెట్టి, నూనె రాయాలి. తవా వేడయ్యాక గరిటతో పిండితీసుకొని దోసెను వేసుకొని, తవా మొత్తం సర్దాలి. తర్వాత దోసె మీద కొద్దిగా నూనె చిలకరించాలి . తర్వాత మీడియం మంట మీద కాల్చుకోవాలి. రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి. అంతే రుచికరమై ఓట్స్ దోసె రిసిపి రెడీ. దీనికి కొబ్బరి చట్నీ, సాంబార్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.