చలికాలంలో జుట్టును కాపాడుకోవడానికి 5 హెయిర్ మాస్క్, Winter Season Hair Mark Home remedies, Easy way to control hair loss specialy in winter







చలికాలంలో చాలా మందికి ఏదో ఒకటి ఇష్టంగా ఫీలవుతారు. చల్లని ఉష్ణోగ్రత లేదా చలికాలంలో వచ్చే వెచ్చని సూర్య కిరణాలంటే చాలా మంది ఇష్టం. అయితే ఇష్టం లేనివి కూడా ఉన్నాయి. చలిగాలికి చర్మం, పగుళ్ళు, జుట్టు రాలడం పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. కాబట్టి చలికాలంలో చర్మంతోపాటు జట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జట్టుబలహీనమై, జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. అందుకనే.. జుట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే సమస్యలనుంచి కురులకు రక్షణ కల్పించుకోవచ్చు.
ఈ కాలంలో శిరోజాల రక్షణకు నీరు తగినంత తీసుకోవడం ద్వారా శిరోజాలు పొడి బారకుండా ఉంటాయి. శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన వాతావరణం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి. జుట్ట రాలడానికి, చిట్లడాన్ని నివారించడంతో పాటు జుట్టు మెరుస్తూ, దట్టంగా పెరగాలంటే అందుకు శీతాకాలంలో ఇంట్లోనే కొన్ని హెయిర్ ప్యాక్స్ ను ప్రయత్నించవచ్చు. మనకు ఇష్టం లేనివి కెమికల్ హెయిర్ ప్యాక్స్ మార్కెట్లో బోలెడెన్ని దొరుకుతున్నాయి. వాటిని ఉపయగించడం కంటే ఇంట్లో తయారు చేసుకొని హెయిర్ ప్యాక్స్ అప్లై చేయడం చాలా సులభం మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండవు...
1. అరటిపండు-తేనె-నిమ్మరసం: పొడి మరియు చిట్లిన(చిక్కుబడిన) జుట్టు- బాగా పొడిబారిన జుట్టుకోసం బనానా హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. బనానాలో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం కలిపి తలలో చర్మానికి మొదళ్ళకు పట్టే విధంగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అరగంట అలాగే వదిలేసి తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు సున్నితంగా, మంచి షైనింగ్ తో మొరుస్తుంటాయి.
2. డ్యామేజ్ అయిన హెయిర్ కోసం-గుడ్డు-తేనె-నిమ్మరసం: జుట్టు మధ్యలోని తెగిపోవడం ఈ సీజన్ లో సహజం. అందుకోసం రెండు గుడ్లను పగులగొట్టి అందలోని పచ్చ సొన మరియు ఒక ఎగ్ వైట్ కలిపి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే మరో గిన్నెలో ఒక కప్పు పెరుగు తీసుకొని తలకు పట్టించి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
3. స్టాటిక్ హెయిర్ కోసం మెంతులు: స్టాటిక్ హెయిర్ కోసం చాలా సింపుల్ మార్గం ఉంది. ఈ సీజన్ లో జుట్టు పోషణకు మెంతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నీటితో సహా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించాలి. ఇది బాగా తడి ఆరిన తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేస్తే వ్యత్యాసం మీకే తెలుస్తుంది.
4. నిర్జీవమైన కురుల కోసం వెనిగర్ మరియు తేనె: ఒక కప్పులో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో వెనిగర్, తెనె రెండూ సమపాళ్ళలో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించడవం వల్ల కురులకు అధిక శక్తినందిస్తుంది. కురుల పెరుగుదలకు ఉపయోగపడే శక్తినిస్తుంది. అయితే ఈ హెయిర్ ప్యాక్ ను వెంటవెంటనే ఉపయోగించకూడదు. వెనిగర్ ఎక్కువ సేపు తలలో ఇంకడం వల్ల కురులకు చెడు ప్రభావం కలిగిస్తుంది.
5. హెయిర్ బ్రేకేజ్ కోసం ఎగ్ -తేనె-క్యాస్ట్రో ఆయిల్ : ఒక గుడ్డులోని పచ్చసొన మరియు రెండు చెంచాలా తేనె, రెండు చెంచాలా క్యాస్ట్రో ఆయిల్. ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల ఈ వింటర్ సీజన్ లో హెయిర్ బ్రేకేజ్ కాకుండా అరికడుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి వింటర్ లో కురులను సంరక్షించుకోండి..    

TAGS : బ్యూటీ, కురుల సంరక్షణ, హెయిర్ మాస్క్, శీతాకాలపు చిట్కాలు,