Preparation of Fish Fry, Special receipe with fish @ kerala, Easy Way home made fish fry teasty & Quick and crispy



ఫిష్ ఫ్రై ఇండియాలో చాలా పాపులర్ డిష్. కొన్నిమన ఇండియన్ మసాలా దినుసులను ఉపయోగించి దీన్ని తయారుచేస్తారు . ఈ ఫిష్ ఫ్రై తయారుచేయడం చాలా సులభం మరియు చాలా తక్కువ సమయంలోనే దీన్ని రుచికరంగా తయారుచే సుకోవచ్చు. కొబ్బరినూనెలో ఫ్రై చేయడం వల్ల క్రిస్పిగా మరియు టేస్టీగా తయారవుతుంది. దీన్ని రోటీ మరియు రైస్ కు సైడ్ డిష్ గా మీల్స్ తో తీసుకోవచ్చు.
ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేసే ఫిష్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ముందుగా మసాలా తయారుచేసి తర్వాత చేపముక్కలకు పట్టించి అరగంట పక్కన పెట్టడం వల్ల చేప ముక్కలకు బాగా మసాలా పట్టి, మరింత టేస్టీగా ఉంటుంది. మరి ఈ రుచికరమైన కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు: 
చేపలు: 1/2kg
కారం: 2tsp
పసుపు: 1/2tbsp
పెప్పర్ పౌడర్: 2tsp
అల్లం : కొద్దిగా
వెల్లుల్లి: 5-6
ఉప్పు : రుచికి సరిపడ
కొబ్బరి నూనె: ఫ్రై చేయడానికి సరిపడా
తయారుచేయు విధానం: 
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్ది కారం, పసుపు, మిరియాలపొడి, ఉప్పు, అల్లం మరియు వెల్లుల్లి వేసి 2-3టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి .
2. మిక్స్ చేసిన తర్వాత ఇది మెత్తగా పేస్ట్ అవుతుంది.
3. ఇప్పుడు ఈ మసాల పేస్ట్ ను శుభ్రం చేసిన చేపముక్కలకు పట్టించి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత, పాన్ తీసుకొని వేడి చేసి అందులో కొబ్బరి నూనె వేసి వేడి అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను కాగే నూనెలో వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి. చేపముక్కలు డార్క్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ అన్ని వైపులా వేడి చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ టేస్టీ డిష్ ను ఉల్లిపాయ మరయు నిమ్మకాయ ముక్కతో సర్వ్ చేయాలి . అంతే కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై రెడీ..