Loss weight with cabbage and pepper Soup at home, Home remedies with cabbage, easy way to prepare soup,



సూప్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉపయోగకరమైనది. భోజనంతో పాటు తీసుకోవచ్చు. లేదా సాయంత్ర సమయంలో ఈ సూప్ ను తీసుకోవచ్చు. సీజన్ బట్టి సూప్ లను తయారు చేసుకోవచ్చు. సూప్ ను తాగడం వల్ల బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సూప్స్ వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చు. అయితే అందులో క్యాబేజ్ మరియు పెప్పర్ తో తయారు చేసే సూప్ చాలా సులభం మరియు టేస్టీ, హెల్తీ కూడా..
దీన్ని చాలా సులభంగా తయారుచేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే, జలుబు దగ్గు నుండి తక్షణ ఉపశమనం పొందడంతో పాటు, బరువును కూడా తగ్గించుకోవచ్చు. క్యాబేజ్ శరీరానికి వేడి పుట్టిస్తుంది. కాబట్టి, అదనపు క్యాలరీలను క్రమంగా తగ్గించుకోవచ్చు. మరి మీరు బరువు తగ్గించుకొనే ప్రయత్నం చేస్తుంటే ఈ వింటర్లో ఒక సారీ మీరూ ప్రయత్నించి చూడండి..
కావల్సినపదార్థాలు:
క్యాబేజ్: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
క్యారెట్ : 2(పొట్టు తీసి సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కార్న్ ఫ్లోర్: 1/2tsp
బ్లాక్ పెప్పర్: 1tsp(పొడి)
ఉప్పు: రుచికి సరిపడా
బట్టర్: 1tsp
తయారుచేయు విధానం: 
1. ముందుగా వెజిటేబుల్స్ ముక్కలన్నీ నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ స్టౌ మీద పెట్టి నీళ్ళు పోసి మరిగించాలి.
3. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్న వెజిటుబుల్ క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
4. అన్ని బాగా మిక్స్ చేసి, మూత పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి పెట్టుకోవాలి. ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీయాలి.
5. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లోబటర్ వేసి అందులో కూరగాయ ముక్కలతో సహా సూప్(కూరలు ఉడికిన నీరు)కూడా అందులో పోయాలి.
6. ఇప్పుడు అందులో బ్లాక్ పెప్పర్ మరియు సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చాలి.
7. సూప్ చిక్కగా రావాలంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్ కలిపి ఉండలు కట్టకుండా మిక్స్ చేయాలి. అంతే పెప్పర్ అండ్ క్యాబేజ్ సూప్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఇది దగ్గు జలుబును నివారిస్తుంది శరీరంలో వేడి పుట్టించి కొవ్వును కరిగిస్తుంది.