పొడవైన మరియు సిల్కీ మృదువైన జుట్టు కావాలని ప్రతి స్త్రీ కల కంటుంది. మీరు ఒక అందమైన బన్ను లేదా ఒక పొడవైన జడ వేసుకోవటానికి, మీ జుట్టు అన్ని సమస్యల నుండి తట్టుకొనే బలం కలిగి ఉండాలి. అవును, మీరు ఎంచుకున్న విధంగా చిన్న మరియు స్టైల్ గా మీ జుట్టును కట్ చేయవచ్చు. కానీ మీరు మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలని గుర్తుంచుకోవాలి.
మీరు సాదారణంగా జుట్టుకి సంబంధించి ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? మీరు చుండ్రు, హెయిర్ ఫాల్,బట్ట తల,చివరల చిట్లుట,జుట్టు తక్కువ పెరుగుదల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకు మీరు అటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీ భారీ జీవనశైలి కొంత బాధ్యతను తీసుకుంటుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు,నిద్రలేని రాత్రులు, జిడ్డు గల ఆహారాలు,బిజీ షెడ్యూల్ మీ జుట్టు సమస్యలకు కారణాలుగా ఉన్నాయి. అంతేకాక,మీ జుట్టుకు గాలి కాలుష్యం,దుమ్ము,నీటి కాలుష్యం వంటివి మరింత నష్టం కలిగిస్తాయి. మీ సమస్యలను వదిలించుకోవటం కొరకు మీరు మార్కెట్ లో అందుబాటులో ఉండే ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ ఆ రసాయన పదార్థాలు మంచి చేయవు. అంతేకాక కొనుగోలు చేయటం వలన డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది.
మీ జుట్టు అన్ని సమస్యలకు ఒక ఉత్పత్తి మరియు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పరిష్కరిస్తే మీ అనుభూతి ఎలా ఉంటుంది? అవును,ఆ ఉత్పత్తి ఆముదం. అనేక దశాబ్దాలుగా,ఆముదమును ప్రపంచంలోని అనేక దేశాలు వాడుతున్నాయి. అముదంలో మీ జుట్టు సమస్యలను పరిష్కరించటం మరియు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
జుట్టు పెరుగుదలకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది
ఆముదము మీ జుట్టు పెరుగుదల ఉద్దీపన కొరకు సహాయపడుతుంది. ఒకే నిష్పత్తిలో ఆలివ్ నూనె మరియు ఆముదంను కలపాలి.మీ జుట్టును భాగాలుగా చేసి ఈ మిశ్రమాన్ని పట్టించి,మూడు నుంచి ఎనిమిది గంటల పాటు అలా వదిలేయాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేయాలి.
జుట్టు మెరుస్తుంది
ఆముదము మీ జుట్టు మీద ఒక సహజ కోట్ ను అందిస్తుంది. మీ జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది. ఒక వారంలో ఒకసారి వేడి నూనె చికిత్స కొరకు అముదంను ఉపయోగించండి. ఇది కండీషనర్ గా పనిచేస్తుంది.
హెయిర్ ఫాల్ ఆగుతుంది
ఆముదముతో,హెయిర్ ఫాల్ నివారణ ఇప్పుడు సులభంగా మారింది. హెయిర్ ఫాల్ ఆపటానికి, స్నానం చేయటానికి ముందు తల మీద చర్మంపై అముదంను శాంతముగా 30 నిముషాలు మర్దన చేయాలి.
చివర్ల చిట్లడం
ఆముదములో విటమిన్ E,ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు మరియు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు సమృద్దిగా లభిస్తాయి. కాబట్టి కోల్పోయిన జుట్టు మళ్లీ వస్తుంది. అలాగే చివర్ల చిట్లడం కూడా నయం అవుతుంది. కేవలం ఆలివ్ లేదా జొజోబా ఆయిల్ కొద్ది మొత్తంలో కలిపి,స్నానానికి ముందు మీ జుట్టు మీద వర్తించాలి.
చుండ్రు నుండి రక్షిస్తుంది
ఆముదములో యాంటి-వైరల్,యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇది చుండ్రుకు వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాడుతుంది. అముదంలో ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మ రసం కలపాలి. స్నానానికి ఒక అరగంట ముందు జుట్టుకి పట్టించాలి.
సహజ మాయీశ్చరైజర్
మీ జుట్టు చాలా పొడి మరియు గజిబిజిగా ఉంటే,ఇకపై అటువంటి సమస్య ఉండదు. మీ జుట్టుకు సహజ తేమను నిలిపి ఉంచటానికి వేడి నూనె చికిత్సలో ఆముదమును ఉపయోగించండి. అలాగే మీ జుట్టు వత్తుగా పెరుగుతుంది.
సహజ కండిషనర్
ఆముదమును కూడా సహజ కండీషనర్ గా ఉపయోగించవచ్చు. ఆలోవెరా జెల్, తేనె మరియు నిమ్మ రసంతో ఆముదమును కలపాలి. జుట్టు మూలాలకు శాంతముగా వర్తించి, 30 నిమిషాల తర్వాత పూర్తిగా శుభ్రం చేయాలి. ఇవి ఖచ్చితంగా మీ జుట్టుకు ఉపయోగపడతాయి. మీ సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని గుర్తుంచుకోండి. కానీ సాధారణ వినియోగం వలన ఒక నెల లేదా రెండు నెలల లోపల మీ సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి. దీనితోపాటు,ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి ప్రయత్నించండి