మేకప్ విషయంలో మీరు చేసే తప్పిదాలు వెంటనే మానేయాల్సినవి, Mistakes in Makeup, every women must see







మహిళలు తమ అందాన్ని మరింత సౌందర్యంగా కనబడాలని మేకప్ వేసుకుంటుంటారు. అయితే వారుఏవిధంగా వేసుకుంటారు?మేకప్ వేసుకొన్న తర్వాత వారి సౌందర్యం మరింత పెరుగుతుంది. మరింత అందంగా కనబడుతుంటారు. మేకప్ మిమ్మల్నిప్రకాశవంతంగా కనబడేలా చేయడమే కాకుండా, వారిలోని దోశరహితమైన చర్మాన్ని (డార్క్ లైన్స్, పింగ్మెంటేషన్ వంటివి)కనబడనియకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్నినింపుతుంది.
అంతే , కాదు మేకప్ వేసుకోవడం వల్ల వారిలో ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది, కానీ ఎక్కువగా మేకప్ వేసుకోవడం వల్ల మీ చర్మం కూడా అందేవిధంగా అనుభూతి చెందుతుంది. ఈ విషయంలో మీరు గందరగోళంగా అనిపిస్తుందా? ఎందుకంటే, కొంత మంది మహిళలు ఎక్కువగా మేకప్ వేసుకుంటుంటారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోరు. అలాంటి వారికోసం ఈ ఆర్టికల్. మేకప్ విషయంలో చేసే తప్పిదాలను తప్పనిసరిగా నివారించాల్సినవి కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ చిన్న చిన్న తప్పుల వల్ల మీ చర్మానికి హాని కలుగుతుంది . కాబట్టి, ఈ క్రింది సూచించన మేకప్ మిస్టేక్స్ ను తప్పకుండా నివారించాలి.

#1. నిద్రించే మందు మేకప్ తొలగించకుండా ఉండటం

మేకప్ వేసుకొన్న తర్వాత ఆ రోజు గడిచిన తర్వాత నిద్రించడానికి ముందు మేకప్ తొలగించడానికి మీరు బద్దకిస్తుంటే, ముందు ముందు మీ చర్మం మరింత డ్రైగా, రఫ్ గా మరియు వయస్సైన వారిగా కనబడేలా చేస్తుంది.ఎక్కువగా మేకప్ వేసుకోవడంవల్ల ఆ వ్యక్తి యొక్క చర్మంలోని షోషన చెంది, వారి మరింత వయసైన వారిలా కనబడేలా చేస్తుంది. చర్మరంద్రాలు నూనెగ్రంధులతో మూసుకొని ఉన్నప్పుడు, క్రమంగా మొటిమలకు దారితీస్తుంది. మరియు అందువల్ల, సమస్యకు గురి అవ్వడం కంటే, ప్రీమెచ్యుర్ ఏజింగ్ పొందడం కన్నా, ఈ సమస్యను నివారించుకోవడానికి నిద్రించే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించుకోవడం ఉత్తమం.

 

#2. మేకప్ బ్రష్ ను శుభ్రం చేయకుండా వాటిని ఉపయోగించడం

 మేకప్ వేసుకొన్నప్పుడు, మీరు ఉపయోగించే బ్రష్ లను అప్పుడప్పుడు, బేబీ షాంపు , గోరువెచ్చని నీటిని ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే, ఈ మరికిపడ్డ బ్రెషులను ఉపయోగిస్తారో, వాటిలో ఇంతకు మందు ఉపయోగించిన మేకప్ సామాగ్రి ఉండటం వల్ల చర్మరంధ్రాలను మూసుకొనేలా చేస్తుంది. అందువల్ల, మీరు ఫ్రెష్ గా మేకప్ వేసుకొన్నా, మీ అందాన్నిపూర్తిగా పాడు చేస్తుంది.

 

#3. కళ్ళకు వేసే మేకప్ ను తప్పుగా శుభ్రపరుచుకోవడం

సహజంగా కళ్ళ వద్ద మేకప్ తొలగించుకోవడానికి తడిగా ఉండే కాటన్ బాల్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే, మీ కళ్ళచుట్టూ ఉండే చర్మం చాలా సున్నితమైనదని మీరు గ్రహించాలి, అది ముడుతలకు దారితీస్తుంది. అదనంగా కళ్ళకు వేసే ఐ లాషెష్ కూడా కళ్ళకు చాలా హాని కలిగిస్తుంది.

 #4. తరచూ వాటర్ ఫ్రూఫ్ మస్కరాను ఉపయోగిస్తుంటారు

 వాటర్ ఫ్రూవ్ మస్కార చాలా మందికి ఇష్టమైనది, ఎందుకంటే, ఇది ఎక్కువ సమయంలో చెరిగిపోకుండా ఉంటుంది. కానీ, లాషెష్ నిజంగా డ్రై అయిపోయేందుకు కారణం అవుతుంది. మరియు ఇలా గట్టిపడిన వాటర్ ఫ్రూఫ్ మస్కరా తొలగించడానికి మరింత కష్టం అవుతుంది. దాంతో మీరు కళ్ళ మీద ఎక్కువగా రుద్దడం వల్ల కళ్ళకు మరింత హాని కలుగుతుంది. ఇది మీ కళ్ళ చుట్టూ అంటుకోవడమే కాకుండా కాకుండా, లాష్ రాలిపోవడానికి కారణం అవుతుంది.