న్యూ ఇయర్ స్పెషల్ : డ్రై ఫ్రూట్ గుజియా, South Indian Special Dry Fruit Gujiya Recipe Preparation easy way, Gyjiya receipe preparation in telugu version

 
తెలుగు సంస్కృతిలోని తియ్యదనాన్ని ప్రపంచ వ్యాప్తంగా రుచిచూపిస్తున్న వంటకం 'కజ్జికాయ', మధురమైన రుచిని సంతరించుకున్న ఈ వంటకం తెలుగు వారికి మాత్రమే సుపరిచితం కాలేదు. దేశ వ్యాప్తంగా 'కజ్జికాయ' వంటకానికి ఎనలేని ఖ్యాతి . ప్రతి తెలుగింటి పండుగులోనూ ప్రముఖ పాత్ర పోషించే ఈ ఘుమ ఘుమ వంటకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సులువైన విధానం ద్వారా ఈ మైమరిపించే రుచిని మీ సొంతం చేసుకోవచ్చు...
స్వీట్స్ అంటే మనందరికీ ఇష్టమే. అయితే కొత్త రుచులు ఆస్వాదించాలంటే సరికొత్త రకాల స్వీట్స్ చేసుకోవాల్సిందే. సాధారణంగా మన ఆహారంలో స్వీట్స్ కి చాలా ప్రాధాన్యం ఉంది. సంతోషం కలిగించే ఏ సందర్భానికైనా నోరు తీపి చేయాల్సిందే. కానీ ప్రతిసారీ షాప్ కి పరుగెత్తాలంటే కష్టమే కాదు. బోలెడంత ఖర్చు కూడా. అందుకే ఓ వెరైటీ స్వీట్ తయారీ విధానం ఇస్తున్నా ప్రయత్నించి చూడండి...వారం, పదిరోజులు నిల్వ ఉండే కజ్జికాయలు ఇంట్లో అందరూ ఇష్టపడతారు. కజ్జికాయలంటే సాధారణంగా అందరికీ శెనగపిండి, కొబ్బరితో చేసుకునేవే గుర్తువస్తాయి. కొందరు పాలకోవాతో, మరికొందరు పిస్తా పప్పుతో కూడా కజ్జికాయలు చేసుకుంటారు. అయితే మనం న్యూ ఇయర్ స్పెషల్ గా వెరైటీగా డ్రైఫ్రూట్స్ తో కలిపి ఎలా చేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
మైదా: 3cups
నెయ్యి: 1/4cup
ఉప్పు: చిటికెడు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
ఫిల్లింగ్ కోసం కావల్సినవి: 
ఎండు కొబ్బరి తురుము: 1/2cup
బాదం: 1/4cup(సన్నగా తరిగి లేదా తురుమి పెట్టుకోవాలి)
పిస్తాచోస్: 1/4cup(సన్నగా తరిగి లేదా తురుమి పెట్టుకోవాలి)
జీడిపప్పు: 1/4cup(సన్నగా తరిగి లేదా తురుమి పెట్టుకోవాలి)
కర్జూరం: కొద్దిగా(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఎండుద్రాక్ష: 1/4cup
యాలకలపొడి: 1/4tsp
తయారుచేయు విధానం: 
1. మిక్సింగ్ బౌల్లో కొద్దిగా మైదా, నెయ్యి మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులో నీరు పోసి మృదువుగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
3.పిండికలిపి పెట్టుకొన్న తర్వాత ఫిల్లింగ్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాల్నింటిని బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి.
4. తర్వాత ముందుగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని ఉండలుగా చేసి, చపాతీలా ఒత్తుకోవాలి. 
5. ఇప్పుడు ఫిల్లింగ్ కోసం తయారుచేసుకొన్న మిశ్రమాన్ని పూరిల మధ్యలో ఒక టేబుల్ స్పూన్ వేసి ఫిల్ చేసి అన్ని వైపులా కవర్ చేయాలి. లోపలి మిశ్రమం బయటపకుండా జాగ్రత్తగా మడవాలి. 
6. ఇలా అన్నింటిని తయారుచేసుకొన్న తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి, వేడి చేయాలి.
7. నూనె కాగిన తర్వాత డ్రై ఫ్రూట్ తో నింపి పెట్టుకొన్న పూరీలను కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా బ్రౌన్ కలర్లో వేగే వరకూ ఫ్రై చేసుకోవాలి.
8. ఒకేసారి 4-5వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. 
9. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి మార్చుకొని సర్వ్ చేయాలి.