కొబ్బరి పాలతో బెంగాలి ఫిష్ కర్రీ, Bengali fish curry with coconut milk, preparation of Fish curry easy way, South Indian spicy receipe with coconut milk


సాధారణంగా చేపలు వంట్లో చాలా తక్కువ వెరైటీలు కలిగి ఉంటాయి. కాబట్టి, మనం వెరైటీ టేస్ట్ ను రుచి చూడాలంటే, మన పక్కన రాష్ట్రల వంటలను ప్రయత్నించవచ్చు . బెంగాలీ వంటలు ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి . తయారుచేయడానిికి చాలా సింపుల్ గానే ఉండే వంటలు, రుచిలో మాత్రం గ్రేట్ గా ఉంటాయి . బెంగాలీ వంటల్లో ఫిష్ వంటలకు పత్యేక ప్రాధాన్యత ఉంది. స్పైసీ ఫిష్ వంటలో మస్టర్డ్ ఫిష్ కర్రీ చాలా ఫేమస్. దీన్నే బెంగాల్లో మచ్చర్ జాల్ అంటారు. ఈ మచ్చర్ జాల్ ఫిష్ కర్రీ చాలా సింపుల్ గా ఉంటుంది.
అయితే మన స్టైల్లో ఈ ఫిష్ కర్రీని, కోకోనట్ మిల్క్ ఉపయోగించి ఎలా తయారుచేయాలో ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. మచ్చర్ జాల్ ఫిష్ కర్రీకి చిన్న చేపలు, తెలాపియ, పబ్దా, టాగ్రా మొదలగు చేపలతో ఎక్కువగా వండుతారు. మచ్చర్ జాల్ స్పైసీ రిసిపి మరి మీరు కూడా టేస్ట్ చేయాలంటే, ఎలా తయారుచేయాలో చూడండి..
కావల్సిన పదార్థాలు: 
చేపముక్కలు: 4 
ఉల్లిపాయ పేస్ట్ : 2tbsp 
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp 
పచ్చి మిర్చి పేస్ట్: 2tsp 
జీలకర్ర పొడి: 1tsp 
కారం పొడి: ½tsp
పసుపు పొడి: 1tsp
గరం మసాలా పొడి: ½ tsp 
జీలకర్ర: 1tsp 
బిర్యానీ ఆకు: 1 
కొబ్బరి పాలు: 1 ½cup
నూనె: 2tbsp 
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం: 
1. ముందుగా చేపముక్కలకు కొద్దిగా పసుపు మరియు ఉప్పు పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి.
2. అరగంట తర్వాత చేపముక్కలను నూనెలో వేసి లైట్ గా వేగించుకోవాలి. అయితే ఓవర్ గా కుక్ చేయకూడదు.
3. ఒక్క సారి ఫ్రై చేసుకొన్న తర్వాత ఈ చేపముక్కలను మరో ప్లేట్ లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
4. అదే పాన్ లో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తరవ్ాత అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అల్లం వెల్ల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. 
7. ఆ తర్వాత అందులోనే జీలకర్ర పొడి, కారం, వేసి మరో 2-3నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 
8. ఇప్పుడు నిధానంగా కొబ్బరి పాలను వేగుతున్న మసాలా మిశ్రమంలో పోసి, మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి.
9. తర్వాత అందులో ఉప్పు మరియు చేప ముక్కలు వేసి మిక్స్ చేసి చేపముక్కలు పూర్తిగా మెత్తగా ఉడికే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి. 
10. చివరగా అందులో గరం మసాలా పొడి వేసి మిక్స్ చేసి, స్టౌ ఆఫ్ చేయాలి అంతే బెంగాల్ ఫిష్ కర్రీ విత్ కోకోనట్ మిల్క్ రెడీ. ఈ స్పెషల్ రిసిపి వేడి వేడి అన్నంతో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. 

Tags : non veg, fish curry, ginger, garlic, green chili, onion, cumin seeds,